అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sita Rama Kalyanam in Yellareddy | శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామారెడ్డి పట్టణంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) పాల్గొన్నారు.
Sita Rama Kalyanam in Yellareddy | ఆలయంలో భక్తులకు ఏర్పాట్లు..
ఈ సందర్భంగా ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో సీసీ నిర్మాణం జరగడంతో.. భక్తులు సౌకర్యంగా కూర్చొని సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. ఈ సౌకర్యం కల్పించినందుకు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ.. శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఎల్లారెడ్డి (Yellareddy) ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇది కూడా చదవండి : Kavitha New Party | ఏప్రిల్ 25న కొత్త పార్టీ.. కవిత కీలక ప్రకటన

