Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Six Guarantees Budget | బడ్జెడ్​లో ఆరు గ్యారెంటీలకు నిధులు శూన్యం: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Six Guarantees Budget | బడ్జెడ్​లో ఆరు గ్యారెంటీలకు నిధులు శూన్యం: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

నిజామాబాద్

Six Guarantees Budget | బడ్జెడ్​లో ఆరు గ్యారెంటీలకు నిధులు శూన్యం: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు బడ్జెట్​లో నిధుల కేటాయింపు శూన్యమని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 23, 2026 2:50 సా.
Srinivas Kolluri
4 రోజులు ago
Share
Six Guarantees Budget

అక్షరటుడే, కామారెడ్డి: Six Guarantees Budget | ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు బడ్జెట్​లో నిధుల కేటాయింపు శూన్యమని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. పట్టణంలోని తన నివాసంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.

Contents
  • Six Guarantees Budget | మేనిఫెస్టోకు.. పాలనకు సంబంధం లేదు..
    • Six Guarantees Budget | రాష్ట్రవ్యాప్తంగా..
      • Six Guarantees Budget | పింఛన్లకు ఒక్క రూపాయి ఇవ్వలేదు..
      • Six Guarantees Budget | ప్రైవేట్​ బిల్లు పెడతాం..

Six Guarantees Budget | మేనిఫెస్టోకు.. పాలనకు సంబంధం లేదు..

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏంటి.. ఇప్పుడు చేస్తుందేంటో చెప్పాలని గంప గోవర్ధన్​ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆరు గ్యారెంటీలను ఆరు చోట్ల ప్రకటించి ఆరు గ్యారెంటీలను చట్టం రూపంలో అమలు చేస్తామని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రకటించారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లకు చేరినా మూడు బడ్జెట్లలో ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పించలేదని విమర్శించారు.

Six Guarantees Budget | రాష్ట్రవ్యాప్తంగా..

రాష్ట్రవ్యాప్తంగా రైతులకు 50 శాతం రుణమాఫీ చేయలేదని, 100 శాతం చేసినట్లు నిరూపిస్తే తాము ముక్కు నేలకు రాస్తామని మాజీ ఎమ్మెల్యే అన్నారు. సిద్దిపేట జిల్లా (Siddipet District) నర్మెటలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్​ ఫ్యాక్టరీని (Oil Palm Factory) ప్రారంభించిన సీఎం రుణమాఫీ చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుళ్ల మీద ఓట్లేసి దేవుళ్లను మోసం చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. రుణమాఫీ లేదని, 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ.2500, పింఛన్ల పెంపు, ఆటో కార్మికులకు రూ.12 వేల సాయం, రైతు కూలీలకు రూ.12 వేలు, విద్యార్థినులకు స్కూటీ, నిరుద్యోగులకు రూ.4 వేల భృతి, విద్యార్థులకు చదువుల కోసం రూ.5 లక్షల సాయం హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

Six Guarantees Budget | పింఛన్లకు ఒక్క రూపాయి ఇవ్వలేదు..

బడ్జెట్​లో పెంచిన పింఛన్లకు ఒక్క రూపాయి కేటాయించలేదని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. రెండున్నరేళ్లలో ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదన్నారు. చివరికి రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. హైకోర్టుకు వెళ్తేనే బెనిఫిట్స్ ఇస్తారా అని ప్రశ్నించారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) గెలిచామని చెప్పుకుంటున్న ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరుపై ఇంటలిజెన్స్ నివేదిక తెప్పించుకోవాలని సూచించారు. అప్పులు తెచ్చి కేసీఆర్ కాళేశ్వరం కట్టారని, మల్లన్న సాగర్ నింపారని, హల్దీవాగు నిండుకుండలా ఉందని తెలిపారు.

Six Guarantees Budget | ప్రైవేట్​ బిల్లు పెడతాం..

మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్​కు (Hyderabad) నీళ్లు తరలించేందుకు రూ.7 వేల కోట్లతో శంకుస్థాపన చేసిన విషయాన్ని గంప గోవర్ధన్​ గుర్తు చేశారు. వచ్చే రెండుమూడు రోజుల్లో ఆరు గ్యారెంటీలకు నిధులు కేటాయించకపోవడంపై ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు ప్రవేశ పెడతామని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం తీరు దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఉందని, ఈ మొండి ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్ పేద ప్రజలను విస్మరించిందని, హామీలను తుంగలో తొక్కిందన్నారు. భవిష్యత్తులో హామీలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, పార్టీ నాయకుడు కుంబాల రవి యాదవ్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Exam Paper Security | సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్ష పత్రాల బండిళ్లు తెరవాలి: కలెక్టర్​

 

Yellareddy Development Funds | ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.14.50 కోట్ల నిధులు మంజూరు
Congress Six Guarantees | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి
Science Fair Students Creativity | సైన్స్‌ ఫెయిర్‌తో విద్యార్థుల్లో సృజనాత్మకత
Dalit Boycott Complaint | డప్పు కొట్టకపోతే బహిష్కరిస్తారట..పోలీసులకు దళితుల ఫిర్యాదు
Farmers Compensation | రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తా: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
TAGGED:Congress PartyHyderabadMunicipal ElectionsOil Palm FactoryRahul GandhiSiddipet DistrictSix Guarantees Budget
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Rythu Bharosa Issue Rythu Bharosa Issue | ఎన్ని ఎకరాల భూమి ఉన్నా.. ఒక్క ఎకరాకే రైతు భరోసా జమ
Next Article ASHA Workers Strike ASHA Workers Strike | ఆశావర్కర్ల సమ్మెకు బీఆర్​ఎస్​ సంపూర్ణ మద్దతు: మాజీ ఎమ్మెల్యే బిగాల
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?