అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : Six Guarantees Legal Status | ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలకు (six guarantees) చట్టబద్ధత కల్పించాలని (welfare schemes) నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Mla Dhanpal) డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
Six Guarantees Legal Status | ఆరు గ్యారంటీలకు..
గత ఏడాది బడ్జెట్లో (government budget) ఆరు గ్యారంటీలకు రూ.56,083 కోట్లు కేటాయిస్తే.. ఈసారి మాత్రం రూ.50,713 కోట్లకే ప్రభుత్వం(budget cuts) పరిమితం చేసిందని ధన్పాల్ వివరించారు. సుమారు రూ.5,370 కోట్లు కోత విధించిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని స్వయంగా రాహుల్ గాంధీ ప్రకటించారని చెప్పారు. ప్రస్తుతం కేటాయించిన నిధులు కూడా పూర్తిగా ఖర్చు చేస్తారని నమ్మకం తమకు లేదన్నారు. ఎందుకంటే గత ఏడాది రూ.49,315 కోట్లు కేటాయింపులు చేసి 24వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు.
Six Guarantees Legal Status | ప్రతి నియోజకవర్గానికి..
అలాగే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. బడ్జెట్లో మాత్రం నిధులను భారీగా కోత విధించిందని ధన్పాల్ సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం గత ఏడాది రూ.12,571 కోట్లు కేటాయిస్తే ఈసారి మాత్రం కేవలం రూ.5500 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. సుమారు రూ. 7వేల కోట్లు కోత విధించిందన్నారు.
ఉచిత బస్సు పథకం ద్వారా..
ఉచిత బస్సు పథకం ద్వారా వేలాదిగా నష్టపోతున్న(telangana politics) ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించిందని (social welfare) ధన్పాల్ చెప్పారు. కానీ ఈ బడ్జెట్లో ఆటో డ్రైవర్లకు మొండి చేయి చూపించిందన్నారు. ఏడాదికి రూ.12వేల భృతి, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి విస్మరించారన్నారు. అలాగే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలన్నారు. అలాగే ఎస్సీ సంక్షేమానికి గత ఏడాదిలో రూ.40వేల కోట్ల నిధులు కేటాయించగా ఈసారి రూ. 11వేల కోట్లకు పరిమితం చేయడం దారుణమన్నారు. ఏది ఏమైనా ప్రస్తుత బడ్జెట్ నిరాశ కలిగించిందని తక్షణమే సవరణ చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Olympiad Education Benefits | ఒలంపియాడ్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు..

