అక్షరటుడే, వెబ్‌డెస్క్: Small LPG Cylinder Demand | పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైననాటినుంచి ముడి చమురు, గ్యాస్ కష్టాలు పెరిగాయి. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ హార్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని మూసి వేయడంతో ముడి చమురు, గ్యాస్ రవాణా నౌకల రాకపోకల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.
మన దేశం వంట గ్యాస్ కోసం ఎక్కువగా ఈ జలసంధిపైనే ఆధారపడుతోంది. దీంతో సాధారణ వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా (Cylinders Supply)లో కొంత జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐదు కిలోల చిన్న ఎల్‌పీజీ సిలిండర్లకు ఆదరణ పెరిగింది.
Small LPG Cylinder Demand | పొందడం సులువు..
ఐదు కిలోల సిలిండర్లను ఎఫ్‌టీఎల్ సిలిండర్లు (FTL Cylinders)గా పిలుస్తారు. గృహవినియోగ 14.2 కిలోల సిలిండర్‌కు కొంత సబ్సిడీ వస్తుండగా.. ఐదు కిలోల సిలిండర్‌ను మార్కెట్ ధరకే ఇస్తారు. అయితే వీటిని పొందేందుకు నివాస ధ్రువీకరణ పత్రం అవసరం లేదు. సమీపంలోని ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లకు (LPG Distributors) చెల్లుబాటయ్యే ఏదైనా గుర్తింపు పత్రాన్ని చూపి దీనిని పొందవచ్చు. ఈ సిలిండర్లను పొందడం సులువు కావడంతో అత్యవసరం అయినవారు చిన్న సిలిండర్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్చి 23 నుంచి ఇప్పటివరకు 6.6 లక్షల చిన్న సిలిండర్లు అమ్ముడయ్యాయని కేంద్రం తెలిపింది. ఒక్క ఏప్రిల్ నాలుగో తేదీనే దేశవ్యాప్తంగా ఎఫ్‌టీఎల్‌లు 90 వేలు అమ్ముడయ్యాయని పేర్కొంది. కాగా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ (Black Marketing)పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సుమారు 40 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించి 50 వేలకు పైగా అక్రమంగా నిల్వ చేసిన సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
Small LPG Cylinder Demand | బ్లాక్ మార్కెట్‌లో మరింత డిమాండ్..
చిన్న సిలిండర్ల (Small cylinders)కు బ్లాక్ మార్కెట్‌లో మరింత డిమాండ్ ఉంది. సాధారణంగా 5 కిలోల సిలిండర్లను బ్యాచ్‌లర్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. గృహవినియోగ 14.2 కిలోల సిలిండర్ కనెక్షన్ తీసుకునే అవకాశం లేకపోవడంతో చిన్న సిలిండర్లను ఆశ్రయిస్తుంటారు. అదీ బ్లాక్ మార్కెట్‌లో సులువుగా లభిస్తుంది. దీనిలో కేజీ నుంచి ఐదు కేజీల వరకు రీఫిల్ చేయించుకుంటుంటారు. ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లకన్నా బయటి మార్కెట్‌లో ఎప్పుడంటే అప్పుడు ఎలాంటి అంక్షలు లేకుండా రీఫిల్ చేయించుకునే అవకాశం ఉండడంతో చాలామంది బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Cyanide Murder Case | కల్తీ మద్యం ఘటనలో సంచలనం.. సైనేడ్‌తో అన్న హత్యకు కుట్ర,ముగ్గురు మృతి
