Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Small Notes ATM | ఇక ఏటీఎంల నుంచే చిన్న నోట్లు.. రూ.10, రూ.20, రూ.50 డ్రా చేసే కొత్త వ్యవస్థకు కేంద్రం సిద్ధం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Small Notes ATM | ఇక ఏటీఎంల నుంచే చిన్న నోట్లు.. రూ.10, రూ.20, రూ.50 డ్రా చేసే కొత్త వ్యవస్థకు కేంద్రం సిద్ధం

జాతీయం

Small Notes ATM | ఇక ఏటీఎంల నుంచే చిన్న నోట్లు.. రూ.10, రూ.20, రూ.50 డ్రా చేసే కొత్త వ్యవస్థకు కేంద్రం సిద్ధం

చిన్న నోట్ల కొరతపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఏటీఎంల నుంచి రూ.10, రూ.20, రూ.50 వంటి చిన్న కరెన్సీ నోట్లను కూడా డ్రా చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 11:09 ఉద.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Small Notes ATM

అక్షరటుడే, వెబ్​డెస్క్: Small Notes ATM | రోజువారీ లావాదేవీల్లో చిన్న నోట్ల అవసరం ఎక్కువగా ఉండటంతో ప్రజలు తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం చాలా ఏటీఎంలలో నగదు విత్‌డ్రా చేస్తే రూ.100, రూ.200, రూ.500 వంటి పెద్ద కరెన్సీ నోట్లు (Currency Notes) మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Contents
  • Small Notes ATM | ఇక చింత అక్క‌ర్లేదు..
    • Small Notes ATM | చిన్న నోట్లు చలామణిలో
      • Small Notes ATM | కొత్త విధానం అమల్లోకి

రూ.10, రూ.20, రూ.50 వంటి చిన్న నోట్లను ఏటీఎంల నుంచి పొందే అవకాశం లేకపోవడంతో చిన్న లావాదేవీల సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్ననోట్ల కొరతపై వస్తున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటీఎంల ద్వారా చిన్న కరెన్సీ నోట్లను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించింది.

Small Notes ATM | ఇక చింత అక్క‌ర్లేదు..

ఇటీవల చిన్న నోట్ల చలామణి తగ్గిందనే ప్రచారం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఈ విషయంపై పార్లమెంటులో కూడా చర్చ జరిగింది. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chowdary) స్పందించారు. రాజ్యసభలో మాట్లాడుతూ దేశంలో చిన్న కరెన్సీ నోట్ల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న సంప్రదాయ ఏటీఎంలు చిన్న నోట్లను పంపిణీ చేసే విధంగా రూపొందించబడలేదని, అందువల్లే ప్రజలకు ఆ అవకాశం లేకపోతుందని వివరించారు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని పరీక్షిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ కింద ‘స్మాల్ డినామినేషన్ డిస్పెన్సర్’ మెషీన్లను పరీక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రత్యేక మెషీన్ల ద్వారా రూ.10, రూ.20, రూ.50 వంటి చిన్న కరెన్సీ నోట్లను నేరుగా ఏటీఎంల నుంచి డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

Small Notes ATM

Small Notes ATM | చిన్న నోట్లు చలామణిలో

ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే చిన్న లావాదేవీల సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆటో ఛార్జీలు, బస్సు టిక్కెట్లు, చిన్న కొనుగోళ్ల సమయంలో పెద్ద నోట్ల మార్పిడి సమస్యకు పరిష్కారం లభించే అవకాశముంది. ఇక కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి 26 వరకు దేశంలో భారీ మొత్తంలో చిన్న నోట్లు చలామణిలో ఉన్నాయి. అందులో రూ.10 నోట్లు రూ.439.4 కోట్ల విలువతో, రూ.20 నోట్లు రూ.193.7 కోట్ల విలువతో, రూ.50 నోట్లు రూ.130.3 కోట్ల విలువతో చలామణిలో ఉన్నట్లు వెల్లడించారు. అలాగే గత ఆర్థిక సంవత్సరంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) భారీగా చిన్న కరెన్సీ నోట్లను సరఫరా చేసింది. అందులో రూ.10 నోట్లు రూ.150 కోట్ల విలువకు, రూ.20 నోట్లు రూ.150 కోట్ల విలువకు, రూ.50 నోట్లు రూ.300 కోట్ల విలువకు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది.

Small Notes ATM | కొత్త విధానం అమల్లోకి

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే భవిష్యత్తులో ఏటీఎంల నుంచి చిన్న నోట్లను కూడా సులభంగా పొందే అవకాశం కలుగనుంది. దీంతో సాధారణ ప్రజల రోజువారీ లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి.

ఇది కూడా చదవండి..: LPG Supply Update | గ్యాస్​ కొరత లేదు.. 10 శాతం​ ఉత్పత్తి పెరిగింది..: కేంద్ర ప్రభుత్వ వర్గాలు

Maoists Surrender Odisha | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 11 మంది సరెండర్
Okha Tirupati Express | ఓఖా–తిరుపతి వీక్లీ ఎక్స్​ప్రెస్​లో మార్పులు
CAPF Bill 2026 | కేంద్ర బలగాల మార్పునకు శ్రీకారం.. CAPF బిల్ 2026 రూపకల్పన!
SIM Binding Implementation | నేటి నుంచి సిమ్​ బైండింగ్​.. మొబైల్​ వినియోగంలో కఠిన నిబంధన!
One Rupee Shoes Offer | రూపాయికే బూట్లని ప్రచారం.. ప్రజలు పోటెత్తడంతో లాఠీఛార్జీ
TAGGED:Central GovernmentCurrency NotesPankaj ChowdaryReserve Bank of IndiaSmall Notes ATM
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hyderabad Gas Shortage Hyderabad Gas Shortage | ఆ వంటలు చేయలేం.. గ్యాస్​ కొరతతో హాస్టళ్ల నిర్ణయం
Next Article Telangana Speaker Decision Telangana Speaker Decision | స్పీకర్​ కీలక నిర్ణయం.. కడియం, దానం అనర్హత పిటిషన్ల కొట్టివేత
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?