Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Smart Number Plate Scam | పోలీసులకు చిక్కకుండా ప్లాన్​.. టెక్నాలజీతో కారు నంబర్ ప్లేట్​​ మార్పు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Smart Number Plate Scam | పోలీసులకు చిక్కకుండా ప్లాన్​.. టెక్నాలజీతో కారు నంబర్ ప్లేట్​​ మార్పు

క్రైంహైదరాబాద్

Smart Number Plate Scam | పోలీసులకు చిక్కకుండా ప్లాన్​.. టెక్నాలజీతో కారు నంబర్ ప్లేట్​​ మార్పు

పోలీసు చలాన్ల నుంచి తప్పించుకోవడానికి ఓ వ్యక్తి హైటెక్​ ప్లాన్​వేశాడు. బటన్​ నొక్కగానే తన కారు నంబర్​ ప్లేట్​ మార్చేలా ఏర్పాటు చేసుకున్నాడు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 12, 2026 11:47 ఉద.
Srinivas Kolluri
12 గంటలు ago
Share
Smart Number Plate Scam

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Smart Number Plate Scam | ప్లేటు ఫిరాయించడం అని మనం తరచూ వింటూ ఉంటాం. ముఖ్యంగా రాజకీయ నాయకుల విషయంలో ఈ మాట వినిపిస్తుంది. అయితే తాజాగా ఓ కారు ఓనర్​ చేసిన పని ప్లేట్​ ఫిరాయింపుకు నిదర్శనంగా నిలిచింది. తన కారు నంబర్​ ప్లేట్​ను టెక్నాలజీ సాయంతో అతడు మార్చే ఏర్పాట్లు చేశాడు.

పోలీసుల చలాన్ల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది వాహనదారులు ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం కొందరు నంబర్​ ప్లేట్ టాంపరింగ్​ చేస్తారు. ప్లేట్​ తొలగించడం, ఇతరుల నంబర్​ ప్లేట్​ పెట్టుకోవడం చేస్తారు. అలాగే కొందరు నంబర్​ కనిపించకుండా ప్లేట్​ను వంచడం, విరగొట్టడం చేస్తుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి హైటెక్ టెక్నాలజీతో తన కారు నంబర్​ ప్లేట్​ మారేలా ఏర్పాట్లు చేశాడు. దీనిని చూసి పోలీసులే షాక్​ అయ్యారు.

Smart Number Plate Scam | హైదరాబాద్​లో..

హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని జూబ్లీహిల్స్​ పరిధిలో శనివారం రాత్రి పోలీసులు డ్రంకన్​ డ్రైవ్ తనిఖీలు (Drunk and Drive) నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ బీఎండబ్ల్యూ కారు (BMW Car)ను తనిఖీ కోసం ఆపారు. ఆ కారులో నంబర్ ప్లేట్ మార్చే టెక్నాలజీ ఉన్నట్లు గుర్తించారు. నంబర్ ప్లేట్ మార్చే టెక్నాలజీ చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ టెక్నాలజీతో ఢిల్లీ, తెలంగాణ నంబర్ ప్లేట్లు ( Smart Number Plate Scam) మారుస్తున్న నిందితుడు. అతడు మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.

ప్లేటు ఫిరాయించడం అంటే ఇదేనేమో!

నంబర్ ప్లేట్ మార్చే టెక్నాలజీ ఉన్న కారుతో దొరికిన వ్యక్తి

జూబ్లీహిల్స్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వ్యక్తి

ఆ వ్యక్తి కారుకు ఉన్న నంబర్ ప్లేట్ మార్చే టెక్నాలజీ చూసి ఆశ్చర్య పోయిన పోలీసులు

ఈ టెక్నాలజీతో ఢిల్లీ, తెలంగాణ నంబర్… pic.twitter.com/M6Udgm1BYM

— Telugu Scribe (@TeluguScribe) April 12, 2026

ఇది కూడా చదవండి : E Cigarette Racket | ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు

Odisha | దారుణం: ఒకేరోజు రెండుసార్లు అత్యాచారం, అనంతరం నాలుగో అంతస్తు నుంచి తోసి హత్య
Footpath Encroachment Drive | ఫుట్​పాత్​ ఆక్రమణలపై కొరఢా
Mother Attack Children | పిల్లలపై కత్తితో దాడి చేసి.. తల్లి ఆత్మహత్యాయత్నం
RTC Bus Discount | ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్​న్యూస్​.. ఆ బస్సుల్లో 30 శాతం డిస్కౌంట్​
Anirudh Hyderabad Concert | అనిరుధ్ సంగీత సందడి.. ఘనంగా ‘రాక్‌స్టార్ అనిరుధ్ XV’ కచేరీ
TAGGED:car number plate fraudHyderabad traffic policesmart number platetech car scamtraffic challan evasionvehicle plate tampering
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Women Reservation 2029 | Women Reservation 2029 | మహిళలకు రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం.. 2029 ఎన్నికల నాటికి అమలు: ఎంపీ అర్వింద్​
Next Article Inter Supplementary Exams Inter Supplementary Exams | మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?