Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Snake Hunting Ability | పాములకు చూపు తక్కువే.. కానీ వేటలో కింగ్! ఆ అద్భుత శక్తి ఏంటో తెలుసా?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

లైఫ్​స్టైల్​ - Snake Hunting Ability | పాములకు చూపు తక్కువే.. కానీ వేటలో కింగ్! ఆ అద్భుత శక్తి ఏంటో తెలుసా?

లైఫ్​స్టైల్​

Snake Hunting Ability | పాములకు చూపు తక్కువే.. కానీ వేటలో కింగ్! ఆ అద్భుత శక్తి ఏంటో తెలుసా?

పాములు చూపుపై కంటే వాసన, కంపనాలు , ఉష్ణోగ్రతను గుర్తించే శక్తులపైనే ఎక్కువగా ఆధారపడి వేటాడతాయి. అందుకే అడవుల్లో లేదా పొలాల్లో నడిచేటప్పుడు శబ్దం చేస్తూ నడిస్తే, ఆ కంపనాలకే పాములు దూరంగా వెళ్లిపోతాయని నిపుణులు చెబుతుంటారు.

Naresh chandan
Last updated: మార్చి 19, 2026 3:59 సా.
Naresh chandan
1 వారం ago
Share
Snake Hunting Ability | పాములకు చూపు తక్కువే.. కానీ వేటలో కింగ్! ఆ అద్భుత శక్తి ఏంటో తెలుసా?
Snake Hunting Ability | పాములకు చూపు తక్కువే.. కానీ వేటలో కింగ్! ఆ అద్భుత శక్తి ఏంటో తెలుసా?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Snake Hunting Ability | పాము పేరు వింటేనే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. విషపూరితమైనా, కాకపోయినా పాము కనిపిస్తే చాలు ఆమడ దూరం పరుగులు తీస్తాం. అయితే, భూమిపై అత్యంత ప్రమాదకరమైన జీవులుగా పేరున్న పాముల గురించి మనకు తెలియని ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పాము కంటిచూపు ఎంత? అది తన ఎరను ఎలా వేటాడుతుంది? అనే విషయాలపై శాస్త్రవేత్తలు కొన్ని ఆసక్తికర నిజాలను వెల్లడించారు.

Contents
  • Snake Hunting Ability | చూపు మందగించినా.. వేటలో మొనగాళ్లు:
    • Snake Hunting Ability | నాలకతోనే వాసన.. కంపనాలతోనే అలికిడి:
      • హీట్ సెన్సార్లతో వేట:

Snake Hunting Ability | చూపు మందగించినా.. వేటలో మొనగాళ్లు:

చాలా మంది పాములకు తీక్షణమైన చూపు ఉంటుందని భావిస్తారు. కానీ, వాస్తవానికి పాములకు కంటిచూపు చాలా తక్కువ. ఇవి సాధారణంగా 1 నుంచి 3 మీటర్ల (3 – 10 అడుగుల) దూరం వరకు మాత్రమే స్పష్టంగా చూడగలవు. అయితే, కింగ్ కోబ్రా వంటి పెద్ద జాతి పాములు మాత్రం సుమారు 10 నుంచి 15 మీటర్ల దూరం వరకు చూడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

Snake Hunting Ability | నాలకతోనే వాసన.. కంపనాలతోనే అలికిడి:

కంటిచూపు తక్కువగా ఉన్నప్పటికీ, పాములు ఇతర ఇంద్రియాల ద్వారా వేటను ఇట్టే పట్టేస్తాయి.

నాలక: పాము పదే పదే నాలుకను బయటకు చాచడం గమనించే ఉంటారు. గాలిలోని అణువులను తన నాలక ద్వారా గ్రహించి, ఎర ఎక్కడ ఉందో వాసన ద్వారా పసిగడుతుంది.

కంపనాలు: పాములకు మనలాగా బయటికి కనిపించే చెవులు ఉండవు. కానీ, భూమిలో కలిగే అతి స్వల్ప కంపనాలను (Vibrations) సైతం తన చర్మం ద్వారా గ్రహిస్తాయి. మనుషులు లేదా జంతువులు దరిదాపుల్లోకి వస్తే ఈ కంపనాల ద్వారానే అవి అప్రమత్తమవుతాయి.

హీట్ సెన్సార్లతో వేట:

కొండచిలువలు, పిట్ వైపర్లు వంటి కొన్ని రకాల పాములకు తల భాగంలో ప్రత్యేకమైన హీట్ సెన్సార్లు ఉంటాయి. ఇవి చీకటిలో కూడా ఇతర జీవుల శరీరం నుంచి వెలువడే వేడిని (Heat) గుర్తించగలవు. కళ్లు కనిపించకపోయినా, ఈ ‘థర్మల్ విజన్’ సాయంతో రాత్రిపూట కూడా పాములు కచ్చితత్వంతో దాడి చేయగలవు.

ఇది కూడా చదవండి: High Protein Breakfast | గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ వీటిలోనే..అవి ఏంటో తెలుసా!

Pink Coffee Benefits | చూడగానే తాగాలనిపించే ఈ పింక్ కాఫీ.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు మామూలుగా లేవుగా!
Hair Wash Frequency | వారంలో ఎన్ని సార్లు తలస్నానం చేయాలో తెలుసా..!
White Hair Myth | తెల్ల జుట్టును పీకేస్తే ఎక్కువ అవుతాయా.. అసలు నిజం ఇదే!
India Dairy Consumption | భారతీయ గృహ పోషణలో డైరీ విప్లవం: 75.8 శాతం మంది యాక్టివ్ వినియోగదారులే!
Financial Tips for Women | ఆర్థిక స్థితిని మార్చేసే ‘గోల్డెన్’ టిప్స్.. సంపన్న మహిళలు పాటించే ఆ 5 సూత్రాలు ఇవే!
TAGGED:animal behaviorhow snakes huntnature sciencereptiles informationsnake hunting abilitysnake sensessnake vision factswildlife facts
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Qatar LNG Impact Qatar LNG Impact | ఖతార్​పై ఇరాన్​ దాడులు.. పలు దేశాలపై తీవ్ర ప్రభావం
Next Article RSS Role Hindu Society RSS Role Hindu Society | హిందూ సమాజాన్ని జాగృతం చేయడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకం : ఎమ్మెల్యే ధన్​పాల్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?