Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: South Central Railway Offer | ఒకే టికెట్‌తో వేర్వేరు తీర్థయాత్రలు.. సౌత్ సెంట్రల్ రైల్వే సూపర్ ఆఫర్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - South Central Railway Offer | ఒకే టికెట్‌తో వేర్వేరు తీర్థయాత్రలు.. సౌత్ సెంట్రల్ రైల్వే సూపర్ ఆఫర్

జాతీయంతాజా వార్తలు

South Central Railway Offer | ఒకే టికెట్‌తో వేర్వేరు తీర్థయాత్రలు.. సౌత్ సెంట్రల్ రైల్వే సూపర్ ఆఫర్

చాలా మంది తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటుంటారు. అయితే అది ఖర్చుతో కూడుకున్నది కావడంతో వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 28, 2026 1:42 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
South Central Railway Offer
South Central Railway Offer

అక్షరటుడే, వెబ్​డెస్క్ : South Central Railway Offer | ఆధ్యాత్మిక క్షేత్రాలను చుట్టిరావాలని భక్తులందరికీ ఉంటుంది. అయితే దీనికి బోలెడు డబ్బు అవసరం అవుతుంది. దీంతో డబ్బులు లేక చాలామంది తీర్థయాత్రలకు వెనకడుగు వేస్తుంటారు. ఇంకొందరు డబ్బులు కూడబెట్టేంతవరకు వాయిదాలతో కాలం గడువుతుంటారు.

Contents
  • South Central Railway Offer | నిబంధనలివి..
    • South Central Railway Offer | ఎక్కడెక్కడికి వెళ్లొచ్చంటే..
      • South Central Railway Offer | బుకింగ్ ఇలా..

అలాంటి వారి తీర్థయాత్ర అభిలాషను తీర్చడం కోసం సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway) సరికొత్త సర్క్యులేటింగ్ జర్నీ టికెట్ ను తీసుకువచ్చింది. తక్కువ ఖర్చుతో పలు తీర్థయాత్రలు చేసే అవకాశాన్ని కల్పించడం దీని ఉద్దేశం. ఒకే టికెట్‌తో వేర్వేరు తీర్థయాత్రలు దీని ప్రత్యేకత. హైదరాబాద్ (Hyderabad) నుంచి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది శుభవార్తనే చెప్పవచ్చు. సాధారణ ప్రయాణ చార్జీలతో పోల్చితే 25 శాతం తక్కువకే ఈ టికెట్ లభిస్తుంది. ప్రస్తుతం నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల (Secunderabad Stations) నుంచి 19 యాత్రలు అందుబాటులో ఉన్నాయి.

South Central Railway Offer | నిబంధనలివి..

ఒక టికెట్‌లో గరిష్ఠంగా 8 బ్రేక్ ప్రయాణాలు చేయవచ్చు. వేర్వేరు రైళ్లు మారొచ్చు.
టికెట్ గడువు 56 రోజుల వరకు ఉంటుంది (దూరాన్ని బట్టి గడువు మారుతుంది).
వృద్ధులకు అదనపు రాయతీలు (పురుషులకు 40 శాతం, మహిళలకు 50 శాతం).

South Central Railway Offer | ఎక్కడెక్కడికి వెళ్లొచ్చంటే..

హైదరాబాద్(నాంపల్లి) స్టేషన్ నుంచి మంత్రాలయం- తిరుపతి- బెంగళూరు సిటీ- చెన్నై సెంట్రల్- భద్రాచలం – హైదరాబాద్(నాంపల్లి).
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీజాపూర్- కొల్హాపూర్- వాస్కోడిగామా- మైసూర్- తిరుపతి- చెన్నై సెంట్రల్- భద్రాచలం రోడ్- హైదరాబాద్(నాంపల్లి).
కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఔరంగాబాద్- ఉజ్జయినీ- భద్రాచలం రోడ్- తిరుపతి- చెన్నై సెంట్రల్- బెంగళూరు సిటీ- మైసూర్- హుబ్లీ- సికింద్రాబాద్.
భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి పూరి- హౌరా- వారణాసి- ఫైజాబాద్- రిషికేష్- దిల్లీ-ముంబయి- హైదరాబాద్(నాంపల్లి).
వీటితో పాటు మరో 15 ప్రయాణాలకు కూడా సదుపాయం ఉంది.

South Central Railway Offer

South Central Railway Offer | బుకింగ్ ఇలా..

సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో డివిజనల్ కమర్షియల్ మేనేజర్ లేదా చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్ కార్యాలయంలో సంప్రదించాలి.
ఎంపిక చేసిన ప్రయాణానికి సంబంధించి చార్జీలు లెక్కించి అధికారులు ఫాం ఇస్తారు.
ఆ ఫాంతో బుకింగ్ కౌంటర్‌లో ట్రైన్ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత విడివిడిగా రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్ నిబంధనల ప్రకారమే బెర్త్ లభిస్తుంది. లేదంటే ఆర్​ఏసీ లేదా అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లో ప్రయాణం చేయవచ్చు.
పూర్తి వివరాల కోసం ఇండియన్ రైల్వే వెబ్‌సైట్‌ను సందర్శించండి.

ఇది కూడా చదవండి..: Delhi Liquor Scam Case | లిక్కర్​ స్కాం కేసు.. హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ

Tirumala Laddu Controversy | కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు..: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
Stock Market Volatility | ప్రారంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
March 13 Gold Prices | బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ప్రధాన నగరాల్లో తాజా పరిస్థితి ఇదే!
TVS Orbiter V1 | రూ.49,999 లకే టీవీఎస్ ఈవీ స్కూటర్.. ఆర్బిటర్ వీ1 ను లాంచ్ చేసిన కంపెనీ
Sunflower Seeds Beauty | సన్‌ఫ్లవర్ గింజలతో ఇలా చేస్తే.. రెట్టింపు అందం సొంతం!
TAGGED:budget travel Indiacirculating journey ticketHyderabad travel newsIndian Railways offerpilgrimage train ticketrailway booking updateSouth Central Railwayspiritual tour India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hyderabad Water Supply Hyderabad Water Supply | నీటి ఎద్దడి నివారణకు చర్యలు.. జలమండలికి 3.95 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
Next Article Israel Iran Tensions Israel Iran Tensions | ఇజ్రాయెల్​ దాడులు.. సురక్షిత ప్రాంతానికి ఇరాన్​ సుప్రీం లీడర్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?