అక్షరటుడే, వెబ్డెస్క్: Special Intensive Revision | తెలంగాణతో పాటు 22 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అయ్యింది. ఈ మేరకు నేడు నోటిఫికేషన్ జారీ చేసింది.
Special Intensive Revision | ఓటర్ల లిస్టు ప్రక్షాళనకు..
దేశంలో నకిలీ ఓట్లు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో నకిలీ ఓటర్లను తొలగించి, ఓటర్ల లిస్టును ప్రక్షాళన చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ‘SIR’ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణతో పాటు మరో 21 రాష్ట్రాల్లో అమలుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఏప్రిల్లో ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన సన్నాహకాలు, శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించింది. తెలంగాణలో రాష్ట్ర ప్రధాన ఎన్నిక అధికారి శిక్షణా కార్యక్రమాలను చేపట్టారు. మే నాటికి క్షేత్రస్థాయి పనులు వేగవంతం చేయనున్నారు. 2002 నాటి పాత డేటాను ప్రస్తుత ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేసే పనిని అధికారులు ఇప్పటికే ప్రారంభించారు.
Special Intensive Revision | ‘SIR’ లోతైన ప్రక్రియ
ఎలక్షన్ కమిషన్ సాధారణంగా ప్రతియేటా నిర్వహించే సమ్మరీ రివిజన్లో మార్పులు, చేర్పులు చేస్తారు. కానీ ‘SIR’ లోతైన ప్రక్రియ. బూత్ లెవల్ అధికారులు నేరుగా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తారు. ఒకే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నట్లయితే ఆధునిక సాంకేతికతతో గుర్తిస్తారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్లో ‘SIR’ ప్రక్రియను కేంద్రఎన్నికల సంఘం పూర్తిచేసిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి..: Sukhoi Su-30 Crash | కూలిపోయిన సుఖోయ్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలెట్ల మృతి

