అక్షరటుడే, భీమ్ గల్: Spiritual centers development | ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కృషి చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి (MLA Prashanth Reddy) అన్నారు. వేల్పూర్ మండల పరిధిలోని జానకంపేట్ గ్రామంలో వెలసిన వేంకటేశ్వర స్వామి ఆలయ (Venkateswara Swamy Temple) అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు.
Spiritual centers development | శాస్త్రోక్తంగా పూజలు..
ఆలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే సీడీపీ నిధులు రూ.5 లక్షలు, ఎంపీ నిధులు రూ.5లక్షలు కలిపి మొత్తం రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులను ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధిలో తానెప్పుడూ ముందుంటానన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అలాగే ఆలయాల అభివృద్ధి ప్రభుత్వం కూడా శ్రద్ధ పెట్టాలని.. అయితే హిందూ ఆలయాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Doddi Komarayya legacy | తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య ఆశయాల సాధనకు కృషి..
