అక్షరటుడే, వెబ్‌డెస్క్: SRH New Captain | ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ గాయం కారణంగా ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.
ఈ నేపథ్యంలో SRH జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా యువ ఆటగాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma) బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే… ఈ సారి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మంచి జోష్‌లో ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. జట్టులో టాప్ ప్లేయర్లు అందరూ ఉండటంతో అభిమానులు భారీ బ్యాటింగ్ ప్రదర్శనను ఆశిస్తున్నారు. గత సీజన్‌లో కూడా SRH బ్యాటింగ్ దళం ఆకట్టుకోవడంతో ఈసారి జట్టు మరింత దూకుడుగా ఆడుతుందనే అంచనాలు ఉన్నాయి.
SRH New Captain | వెన్ను నొప్పి సమస్యతో..
అయితే జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ (Captain Pat Cummins) వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్ సమయంలో కూడా గాయం కారణంగా కమ్మిన్స్ కొన్ని మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు కోలుకునే ప్రక్రియలో ఉన్నప్పటికీ, ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ సమయానికి పూర్తిగా ఫిట్‌గా ఉంటారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.ఈ నేపథ్యంలో ఒకవేళ కమ్మిన్స్ అందుబాటులోకి రాకపోతే జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా అభిషేక్ శర్మను నియమించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. యువ ఆటగాడైన అభిషేక్ గత కొన్ని సీజన్లలో SRH తరఫున అద్భుత ప్రదర్శన చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అతడి దూకుడైన బ్యాటింగ్‌తో పాటు జట్టులోని ఆటగాళ్లతో మంచి సమన్వయం ఉండటంతో మేనేజ్‌మెంట్ కూడా అతనిపై విశ్వాసం ఉంచుతున్నట్లు తెలుస్తోంది.
SRH New Captain | అభిషేక్ శర్మ ఒక్కరే కాకుండా మరో స్టార్ ప్లేయర్
అయితే కెప్టెన్సీ రేసులో అభిషేక్ శర్మ ఒక్కరే కాకుండా మరో స్టార్ ప్లేయర్ పేరు కూడా వినిపిస్తోంది. టీ20 ఫార్మాట్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో గుర్తింపు పొందిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) పేరును కూడా జట్టు మేనేజ్‌మెంట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్ కప్‌లో అతడు చేసిన దూకుడైన బ్యాటింగ్ కారణంగా కెప్టెన్సీకి సరైన ఎంపికగా భావిస్తున్నారనే చర్చలు వినిపిస్తున్నాయి.అయితే ఈ విషయంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మేనేజ్‌మెంట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కమ్మిన్స్ ఫిట్‌నెస్ పరిస్థితి ఆధారంగానే తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
SRH New Captain | సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్
ఇదిలా ఉండగా, ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన తొలి షెడ్యూల్‌ను BCCI విడుదల చేసింది. ప్రస్తుతం కేవలం 20 మ్యాచ్‌లకు సంబంధించిన వివరాలు మాత్రమే ప్రకటించారు. ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. మార్చి 28న బెంగళూరులో ఈ మ్యాచ్ జరగనుంది.
SRH ప్రారంభ మ్యాచ్‌ల షెడ్యూల్:
మార్చి 28: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – బెంగళూరు
ఏప్రిల్ 2: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ – కోల్‌కతా
ఏప్రిల్ 5: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ – హైదరాబాద్
ఏప్రిల్ 11: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ – న్యూ చండీగఢ్
మొత్తానికి ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే SRH కెప్టెన్సీ అంశం ఆసక్తికరంగా మారింది. పాట్ కమ్మిన్స్ ఫిట్‌నెస్‌పై ఆధారపడి జట్టు నాయకత్వం మారుతుందా లేదా అన్నది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అభిమానులు మాత్రం తమ జట్టు ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన చేసి టైటిల్ గెలవాలని ఆశిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: IPL 2026 Schedule | ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్‌లో తలపడే జట్లు ఇవే..

