Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sri Lanka Defeat | ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో లంకకి ఘోర‌ అవమానం… 19 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదో చెత్త రికార్డు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - Sri Lanka Defeat | ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో లంకకి ఘోర‌ అవమానం… 19 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదో చెత్త రికార్డు

క్రీడలుతాజా వార్తలు

Sri Lanka Defeat | ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో లంకకి ఘోర‌ అవమానం… 19 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదో చెత్త రికార్డు

కొలంబోలో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక 61 పరుగుల తేడాతో ఓడింది. పవర్‌ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసి టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే చెత్త రికార్డును లంక జట్టు నమోదు చేసింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 26, 2026 5:08 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
Sri Lanka Defeat

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Sri Lanka Defeat | టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశలో భాగంగా కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియం Premadasa Stadium వేదికగా జరిగిన కీలక పోరులో శ్రీలంక జట్టుకు (Sri Lanka Defeat) చేదు అనుభవం ఎదురైంది.

Contents
  • Sri Lanka Defeat | అద్భుత‌మైన భాగ‌స్వామ్యం..
    • 61 పరుగుల తేడాతో ఓటమి
      • నిష్క్రమించిన శ్రీలంక

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక‌ 61 పరుగుల తేడాతో ఓడిపోవడమే కాకుండా, టోర్నీ చరిత్రలోనే అత్యల్ప పవర్‌ప్లే స్కోరును నమోదు చేసి అవమానకర రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ (New Zealand) ఆరంభంలో జాగ్రత్తగా ఆడింది. ఒక దశలో 75 పరుగులకే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి భారీ స్కోరు దిశగా సాగింది. అయితే లంక బౌలర్లు పుంజుకుని 9 పరుగుల వ్యవధిలో 4 కీలక వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. 84 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కివీస్ కష్టాల్లో పడింది.

Sri Lanka Defeat | అద్భుత‌మైన భాగ‌స్వామ్యం..

ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ Santner , కోల్ మెక్కాన్చీలు అద్భుత భాగస్వామ్యంతో జట్టును గట్టెక్కించారు. ఏడో వికెట్‌కు 47 బంతుల్లో 84 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి, జట్టు స్కోరును 20 ఓవర్లలో 168/7కు చేర్చారు. ఈ భాగస్వామ్యమే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ప్రారంభంలోనే కివీస్ బౌలర్లు గట్టి షాక్ ఇచ్చారు. పవర్‌ప్లే 6 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయిన లంక, టీ20 ప్రపంచకప్ చరిత్రలో తన అత్యల్ప పవర్‌ప్లే స్కోరును నమోదు చేసింది. పెద్ద లక్ష్యాన్ని ఛేదించాల్సిన సందర్భంలో ధాటిగా ఆడాల్సింది పోయి, జాగ్రత్తగా ఆడుతూ వికెట్లు కోల్పోవడం జట్టుకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.

Sri Lanka Defeat

61 పరుగుల తేడాతో ఓటమి

చివరికి శ్రీలంక 20 ఓవర్లలో 107/8 పరుగులకే పరిమితమై 61 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కామిందు మెండిస్ (31) మినహా మిగతా బ్యాటర్లు ఎవ్వరూ రాణించలేకపోయారు. కివీస్ New Zealand తరఫున స్పిన్నర్ రచిన్ రవీంద్ర నాలుగు వికెట్లు తీసి లంక పతనానికి ప్రధాన కారణమయ్యాడు.

నిష్క్రమించిన శ్రీలంక

ఈ ఓటమితో శ్రీలంక సెమీఫైనల్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. మరోవైపు న్యూజిలాండ్ తన చివరి మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా సెమీస్‌కు చేరుకునే స్థితిలో ఉంది. మొత్తం మీద కొలంబో వేదికగా లంక జట్టుకు ఇది మరచిపోలేని చేదు జ్ఞాపకంగా మిగిలింది.

ఇది కూడా చదవండి..: India Semi final Chances | జింబాబ్వే చిత్తుగా ఓడ‌డంతో ప్రమాదంలో టీమిండియా.. భారత్ సెమీస్ ఆశలు క్లిష్టం.. NRR కీలకం

Record Power Demand | రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​
Ishan Kishan SRH | SRH ప్రాక్టీస్ మ్యాచ్‌లో హీటెక్కిన సన్నివేశం.. కెప్టెన్‌నే గెటౌట్ అంటూ సైగ చేసిన యువ క్రికెట‌ర్
Kabul Airstrike | కాబూల్‌లో వైమానిక దాడి.. 400 మంది దుర్మరణం అంటూ తాలిబన్ ఆరోపణ.. పాకిస్థాన్ ఖండన
Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ..: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
Tadbund Hanuman Temple | భజనలు, కీర్తనలు.. జెన్​జీ కి శనివారం నైట్​ హబ్​గా తాడ్​బండ్​ హనుమాన్​ సన్నిధి!
TAGGED:Colombo MatchMitchell SantnerNew Zealand CricketPowerplay RecordPremadasa StadiumRachin RavindraSri Lanka CricketSri Lanka DefeatSri Lanka vs New ZealandT20 World Cup 2026
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kamareddy college land controversy Kamareddy college land controversy : ఆస్తుల దుమారం.. కాలేజీ చుట్టూ వివాదం
Next Article Telangana Road Safety Cess Telangana Road Safety Cess | పెరగనున్న వాహనాల ధరలు.. ‘రోడ్​ సేఫ్టీ సెస్’​ విధించిన తెలంగాణ ప్రభుత్వం
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?