Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sri Rama Navami | శ్రీరామ నవమి ఎప్పుడు.. పండుగ తేదీపై పండితుల స్పష్టత ఇదే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

భక్తి - Sri Rama Navami | శ్రీరామ నవమి ఎప్పుడు.. పండుగ తేదీపై పండితుల స్పష్టత ఇదే!

భక్తితాజా వార్తలు

Sri Rama Navami | శ్రీరామ నవమి ఎప్పుడు.. పండుగ తేదీపై పండితుల స్పష్టత ఇదే!

శ్రీరామనవమి.. ధర్మ మార్గంలో నడవాలని మనకు గుర్తు చేసే పవిత్ర దినం. ఈ రోజున రామ మందిరాల్లో ప్రత్యేక అర్చనలు, భజనల వంటి కార్యక్రమాలు భక్తిభావంతో నిర్వహిస్తారు.

Naresh chandan
Last updated: మార్చి 24, 2026 3:53 సా.
Naresh chandan
3 రోజులు ago
Share
Sri Rama Navami | శ్రీరామ నవమి ఎప్పుడు.. పండుగ తేదీపై పండితుల స్పష్టత ఇదే!
Sri Rama Navami | శ్రీరామ నవమి ఎప్పుడు.. పండుగ తేదీపై పండితుల స్పష్టత ఇదే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sri Rama Navami | హిందూ సంప్రదాయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే పండుగలలో శ్రీరామనవమి ప్రధానమైనది. అయోధ్యలో దశరథ మహారాజు, కౌసల్య దేవి దంపతులకు చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామచంద్రుడు జన్మించారు.

Contents
  • Sri Rama Navami | తేదీల గందరగోళానికి కారణమేంటి?
    • Sri Rama Navami | పండితులు ఏమంటున్నారు?
      • పూజా ముహూర్తం , విశిష్టత:

ఆదర్శ పురుషుడిగా, ధర్మానికి ప్రతిరూపంగా నిలిచిన రామయ్య జన్మదినాన్ని, సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రతి పల్లె, పట్టణంలో వేడుకలు అంబరాన్నంటుతాయి. అయితే 2026 సంవత్సరంలో ఈ పండుగ తేదీ విషయంలో భక్తుల్లో కొంత గందరగోళం నెలకొంది.

Sri Rama Navami | తేదీల గందరగోళానికి కారణమేంటి?

సాధారణంగా హిందూ క్యాలెండర్ ప్రకారం తిథులు రెండు రోజుల పాటు వచ్చినప్పుడు పండుగ ఏ రోజు నిర్వహించుకోవాలనే అంశంపై చర్చ వస్తుంటుంది. 2026లో నవమి తిథి వివరాలు ఇలా ఉన్నాయి.

నవమి తిథి ప్రారంభం: మార్చి 26, మధ్యాహ్నం 2:18 గంటలకు.

నవమి తిథి ముగింపు: మార్చి 27, మధ్యాహ్నం 12:36 గంటలకు.

చాలా క్యాలెండర్లలో మార్చి 26వ తేదీనే నవమిగా పేర్కొన్నప్పటికీ, దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలలో సూర్యోదయ సమయానికి ఉన్న తిథినే ప్రామాణికంగా తీసుకుంటారు.

Sri Rama Navami | పండితులు ఏమంటున్నారు?

శాస్త్ర వచనాల ప్రకారం, సూర్యోదయ వేళలో ఏ తిథి ఉంటుందో ఆ రోజునే పండుగ నిర్వహించడం శుభప్రదం. మార్చి 27వ తేదీ శుక్రవారం ఉదయం సూర్యోదయ సమయానికి నవమి తిథి ఉన్నందున, ఆ రోజే శ్రీరామనవమి జరుపుకోవాలని పండితులు స్పష్టం చేశారు. భద్రాచల క్షేత్రంలో కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని మార్చి 27వ తేదీనే నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Sri Rama Navami | శ్రీరామ నవమి ఎప్పుడు.. పండుగ తేదీపై పండితుల స్పష్టత ఇదే!
Sri Rama Navami | శ్రీరామ నవమి ఎప్పుడు.. పండుగ తేదీపై పండితుల స్పష్టత ఇదే!

పూజా ముహూర్తం , విశిష్టత:

శ్రీరాముడిని పూజించడానికి మధ్యాహ్న సమయం అత్యంత శ్రేష్ఠమైనది. మార్చి 27వ తేదీ ఉదయం 11:06 గంటల నుండి మధ్యాహ్నం 1:31 గంటల వరకు పూజకు అనుకూలమైన సమయం (మధ్య ముహూర్తం). ఇదే సమయంలో భద్రాద్రిలో స్వామివారి కళ్యాణం కనులపండువగా జరుగుతుంది.

శ్రీరామనవమి కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, అది ధర్మ మార్గంలో నడవాలని మనకు గుర్తు చేసే పవిత్ర దినం. ఈ రోజున రామ మందిరాల్లో ప్రత్యేక అర్చనలు, భజనలు, పానకం , వడపప్పు పంపిణీ వంటి కార్యక్రమాలు భక్తిభావంతో నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడం వల్ల సర్వ పాపాలు తొలగి, శుభం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఇది కూడా చదవండి: Swayampaka Danam | స్వయంపాక దానం ఎలా చేయాలి.. ఏ వస్తువులు ఇస్తే శుభ ఫలితాలు కలుగుతాయి!

Iran Israel War UPDATES | మోజ్తాబా ఎన్నిక.. ఇరాన్​ యుద్ధంపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు
Gold Price Fall | దిగివస్తున్న బంగారం ధర.. ఆల్ టైం హైనుంచి సగం తగ్గిన వెండి
Iran US Tensions | జెనీవా చర్చలు విఫలం.. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు యథాతథం!
Gold Pink Paper | బంగారానికి గులాబీ రంగు కాగితం.. ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం తెలుసా!
Revive Plants Tips | మొక్కలు వాడిపోతున్నాయా.. ఈ చిట్కాలతో పచ్చగా మార్చండిలా!
TAGGED:bhadrachalam templefestival celebrationshindu festivals indiaindian festivals 2026lord rama birthrama navami daterama navami muhuratsri rama navami 2026
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Eye Care Awareness | Eye Care Awareness | కళ్ల సంరక్షణకు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Next Article School Early Admissions School Early Admissions | ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?