అక్షరటుడే, మెదక్ : Sri Rama Pallaki Seva | మెదక్ (Medak) జిల్లా హవేలి ఘన్పూర్ (Haveli Ghanpur) మండలం బూర్గుపల్లిలో శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం సీతారాముల కల్యాణాన్ని వైభవంగా జరిపించారు.
Sri Rama Pallaki Seva | భక్తులకు అన్నదానం
రాములోరి కల్యాణ వేడుకలను చూడటానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులకు గ్రామ పెద్దలు అన్నదానం చేశారు. రాత్రి పల్లకి సేవను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగించారు. డీజే సౌండ్ మధ్య పల్లకి సేవ సాగింది. యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి పాటలకు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ సాయిలు, మాజీ ఎంపీటీసీ అర్చన శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. హవేలి ఘన్పూర్ మండలంలోని మిగతా గ్రామాల్లో సైతం శ్రీరామ నవమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిపించారు.
దీనిని కూడా చదవండి : Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ అభివృద్ధికి చర్యలు

