Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: SSC Exam Rules | ఎస్​ఎస్​సీ పేపర్​ లీకేజీ వ్యవహారం.. పర్యవేక్షణ మరింత కఠినతరం!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - SSC Exam Rules | ఎస్​ఎస్​సీ పేపర్​ లీకేజీ వ్యవహారం.. పర్యవేక్షణ మరింత కఠినతరం!

నిజామాబాద్తాజా వార్తలు

SSC Exam Rules | ఎస్​ఎస్​సీ పేపర్​ లీకేజీ వ్యవహారం.. పర్యవేక్షణ మరింత కఠినతరం!

జిల్లాలోని వివిధ మండలాల విద్యాధికారులను ఫ్లయింగ్ స్క్వాడ్ లుగా నియమించారు. పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించేందుకు వీరిని నియమించారు. వీరు మార్చి 23 నుంచి పరీక్షలు పూర్తయ్యే వరకు ఆయా కేంద్రాలను తనిఖీ చేస్తూ అక్రమాలను అరికట్టనున్నారు.

Naresh chandan
Last updated: మార్చి 22, 2026 10:01 సా.
Naresh chandan
4 రోజులు ago
Share
SSC Exam Rules | ఎస్​ఎస్​సీ పేపర్​ లీకేజీ వ్యవహారం.. పర్యవేక్షణ మరింత కఠినతరం.. కేంద్రాలకు జియో ట్యాగింగ్​!
SSC Exam Rules | ఎస్​ఎస్​సీ పేపర్​ లీకేజీ వ్యవహారం.. పర్యవేక్షణ మరింత కఠినతరం.. కేంద్రాలకు జియో ట్యాగింగ్​!

అక్షరటుడే, ఇందూరు: SSC Exam Rules | SSC పబ్లిక్ పరీక్షల నిర్వహణలో అక్రమాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు నిజామాబాద్​ జిల్లా విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి (DEO) కార్యాలయం నుంచి ప్రకటన విడుదల అయింది.

Contents
  • SSC Exam Rules | కఠిన నియంత్రణ
    • SSC Exam Rules | సెల్‌ఫోన్‌పై నిషేధం ఉన్నా..

జిల్లాలో SSC పరీక్షలు – 2026 జరుగుతున్నాయి. కాగా, మొన్నటి హిందీ పరీక్ష పేపర్​ లీకేజీ కావడంతోపాటు నెట్టింట వైరల్​ అయింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఘటనతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న పలువురు ఉపాధ్యాయులు సస్పెండ్​ అయ్యారు.

ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఇప్పటికే ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయ్యాయి. జిల్లాలోని ఎంఈవోలను ఇందుకోసం నియమించారు.

SSC Exam Rules | కఠిన నియంత్రణ

పరీక్షల నిర్వహణ సమయంలో.. పరీక్ష విధుల్లో లేని ఉపాధ్యాయులు పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ఉండరాదని DEO స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, CCA రూల్స్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనికితోడు అన్ని పరీక్షా కేంద్రాలను జియో ట్యాగింగ్ చేశారు. తద్వారా మరింత కట్టుదిట్టంగా పర్యవేక్షించనున్నారు.

SSC Exam Rules | సెల్‌ఫోన్‌పై నిషేధం ఉన్నా..

పరీక్ష జరిగే సమయంలో సిబ్బంది సెల్‌ఫోన్లు తీసుకురావడంపై పూర్తిగా నిషేధం విధించారు. పరీక్ష విధుల్లో ఉన్నవారిలో ఎవరైనా సెల్‌ఫోన్‌తో పట్టుబడితే, వారిని తక్షణమే సర్వీస్ నుంచి తొలగించనున్నట్లు హెచ్చరించారు. కాగా, ఇటీవల జరిగిన హిందీ పేపర్​ లీకేజీ వ్యవహారంలో వేటుకు గురైన ఉపాధ్యాయుల పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ముఖ్యంగా విద్యార్థులు ట్రిపుల్​ ఐటీ సీట్లు పొందేందుకు ముందస్తుగా ఒప్పందం చేసుకుని పేపర్​ లీకేజీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్​కు గురైన ఉపాధ్యాయుల్లో కొందరిని సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే విషయమై రాష్ట్ర స్థాయి అధికారులు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా.. పదో తరగతి పేపర్​ లీకేజీ వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్​ ఇలా త్రిపాఠి అత్యంత తీవ్రంగా పరిగణించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కలెక్టర్​ టెలి కాన్ఫరెన్స్​ ద్వారా విద్యాశాఖ అధికారులు, విధుల్లో ఉన్న అధికారులకు సీరియస్​గా వార్నింగ్​ ఇచ్చినట్లు తెలిసింది.

ఇదే సమయంలో కీలకమైన సూచనలు సైతం చేశారు. కాగా, ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్​ ను కొందరు ఉపాధ్యాయులు వాట్సప్​ గ్రూపుల్లో వైరల్​ చేశారు. క్రమశిక్షణకు మారు పేరుగా ఉండాల్సిన టీచర్లు, విద్యాశాఖ అధికారులు పదో తరగతి పరీక్షల సమయంలో ఇలా అక్రమాలకు పాల్పడటంపై విమర్శలు వెలువడుతున్నాయి. అయితే, సోమవారం జరగబోయే ఆంగ్ల పరీక్ష నిర్వహణ అధికారులకు కత్తి మీద సాముగా మారిందని పలువురు చర్చించుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: SSC Paper Leak | నిజామాబాద్​లో ఎస్​ఎస్​సీ హిందీ పేపర్​ లీకేజీ.. నెట్టింట వైరల్​.. తొమ్మిది మంది ఉపాధ్యాయులపై వేటు!

Car Fire Accident | రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు..
Sleeping Direction Vastu | ఈ దిశలో తల పెట్టి పడుకుంటున్నారా.. అయితే అనారోగ్యం తప్పదు!
Telangana Assembly Clash | అసెంబ్లీలో ఇప్పసారా రగడ.. మంత్రి పొన్నం – ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మాటల యుద్ధం!
March 04 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
March 24 Horoscope | పోస్టు ద్వారా అద్భుత సమాచారం.. ఈ రాశుల వారికి ఇక కొండంత సంతోషం!
TAGGED:exam guidelinesexam rulesFlying SquadIndia examsmalpractice preventionNizamabad DEOschool educationSSC Exams
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Strengthen Bones Diet | ఎముకల అరుగుదలకు బ్రేక్.. మహిళల ఆరోగ్యానికి ఇవే కరెక్ట్ డైట్! Strengthen Bones Diet | ఎముకల అరుగుదలకు బ్రేక్.. మహిళల ఆరోగ్యానికి ఇవే కరెక్ట్ డైట్!
Next Article Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణా.. ట్రాక్టర్​ సీజ్​ Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణా.. ట్రాక్టర్​ సీజ్​
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?