Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: SSC Exams | ఇక పదో తరగతి పరీక్షలు ఉండవు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - SSC Exams | ఇక పదో తరగతి పరీక్షలు ఉండవు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ

SSC Exams | ఇక పదో తరగతి పరీక్షలు ఉండవు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకు వస్తామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. భవిష్యత్​లో పదో తరగతి పరీక్షలు ఉండవని తెలిపారు.

Srinivas kolluri
Last updated: మార్చి 20, 2026 6:53 సా.
Srinivas Kolluri
6 రోజులు ago
Share
SSC Exams

అక్షరటుడే, వెబ్​డెస్క్: SSC Exams | రాష్ట్రంలో భవిష్యత్​లో పదో తరగతి పరీక్షలు ఉండవని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు వస్తామని చెప్పారు. బడ్జెట్​ అనంతరం ఆయన మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు.

Contents
  • SSC Exams | సంక్షేమ బడ్జెట్
    • SSC Exams | మూసీపై ముందుకే..
      • SSC Exams | పీసీసీ చీఫ్​ చూసుకుంటారు

ప్రస్తుతం రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు ఎస్​ఎస్​సీ బోర్డు (SSC Board) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వీటిని తొలగిస్తామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం అమలు చేస్తామన్నారు. జాతీయ స్థాయిలో +2 విధానం అమలులో ఉందన్నారు. దీనిపై అధ్యయనం చేసిన తర్వాత తెలంగాణలో అమలు చేస్తామని తెలిపారు. ఇటీవల విద్యా కమిషన్​ ఇచ్చిన నివేదిక ఫైనల్ కాదన్నారు. కాగా ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఏడో తరగతికి వార్షిక పరీక్షలు బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించేవారు. సుమారు రెండు దశాబ్దాల క్రితం దానిని తొలగించారు. అలాగే ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు సైతం తొలగించనున్నట్లు సీఎం తెలిపారు.

students 2

SSC Exams | సంక్షేమ బడ్జెట్

తమది సంక్షేమం, అభివృద్ధి బడ్జెట్​ (Telangana Budget) అని సీఎం అన్నారు. బడ్జెట్‍కు వ్యతిరేకంగా చెవిలో పువ్వులతో బీఆర్​ఎస్​ చేపట్టిన నిరసనపై ఆయన సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ నేతల వీపుపై బండలు కట్టాలన్నారు. కేసీఆర్ బయటకి రాకుండా గృహ నిర్బంధం చేశారని ఆరోపించారు. ఫోన్​ ట్యాపింగ్​  (Phone Tapping)కేసులో విచారణ పూర్తి కాకుండా చర్యలు తీసుకోలేమన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్​రావు అమెరికాలో ఉండటంతో విచారణ ఆలస్యం అయిందన్నారు.

SSC Exams | మూసీపై ముందుకే..

భూముల అమ్మకానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదని రేవంత్​రెడ్డి చెప్పారు. భూములు అమ్మితే వచ్చిన డబ్బులను సొంతానికి వాడుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. మూసీ ప్రాజెక్ట్​ విషయంలో ఆగేది లేదన్నారు. నష్టపోతున్న వారిని ఆదుకుంటామని చెప్పారు. మూసీ ప్రాజెక్ట్ విషయంలో గాంధీ మనుమడు బీఆర్ఎస్ ట్రాప్‍లో పడ్డారని సీఎం అన్నారు.

SSC Exams | పీసీసీ చీఫ్​ చూసుకుంటారు

రాష్ట్రంలో డ్రగ్స్​ వ్యవహారంపై పెద్ద చర్చ జరుగుతుంటే బీజేపీ ఎందుకు స్పందించడం లేదని సీఎం ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు కలిసి ఉన్నాయని అనడానికి ఇదే నిదర్శనం అన్నారు. బీఆర్ఎస్ వాళ్లని తిడితే బీజేపీ ఎందుకు మాట్లాడుతోందన్నారు. మాజీ మంత్రి జీవన్​రెడ్డి అంశాన్ని పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​ చూసుకుంటారని తెలిపారు. కాగా జీవన్​రెడ్డి పార్టీ మారతానని ప్రకటించిన విషయం తెలిసిందే.

దీనిని కూడా చదవండి : Telangana Pension Scheme | కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లు.. ఇంటర్​ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

Prajapalana Pragathi Pranalika | ప్రగతి ప్రణాళికలో అందరినీ భాగస్వామ్యులను చేయాలి
Krishna River Water | చుక్క నీరు కూడా వదులుకోం : మంత్రి ఉత్తమ్​
Gulf Telugu Advisory | గల్ఫ్​లో ఉన్న తెలుగు వారికి సీఎం కీలక సూచనలు
Karimnagar ACB Arrest | యూపీఐ ద్వారా లంచాలు.. ఏసీబీకి చిక్కిన సూపరింటెండెంట్
Sircilla Weavers Dues | నేత కార్మికుల విద్యుత్​ బకాయిలు రద్దు చేయాలి : కేటీఆర్​
TAGGED:education reforms IndiaRevanth Reddy newsSSC board updateTelangana school systemTelangana SSC exams
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Students Drowned Students Drowned | గోదావరిలో ఐదుగురు విద్యార్థుల గల్లంతు
Next Article Alur House Theft | Alur House Theft | ఆలూర్​లో దొంగల బీభత్సం.. పది తులాల బంగారం చోరీ..
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?