Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: SSC Exams Nizamabad | ఎస్సెస్సీ పరీక్షల తీరుపై కలెక్టర్​ ఆగ్రహం.. చీఫ్​ సూపరింటెండెంట్​కు​ షోకాజ్ ఇవ్వాలని ఆదేశం..​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - SSC Exams Nizamabad | ఎస్సెస్సీ పరీక్షల తీరుపై కలెక్టర్​ ఆగ్రహం.. చీఫ్​ సూపరింటెండెంట్​కు​ షోకాజ్ ఇవ్వాలని ఆదేశం..​

నిజామాబాద్

SSC Exams Nizamabad | ఎస్సెస్సీ పరీక్షల తీరుపై కలెక్టర్​ ఆగ్రహం.. చీఫ్​ సూపరింటెండెంట్​కు​ షోకాజ్ ఇవ్వాలని ఆదేశం..​

జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 28, 2026 4:49 సా.
Srinivas Kolluri
12 గంటలు ago
Share
SSC Exams Nizamabad

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: SSC Exams Nizamabad | జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు.

Contents
  • SSC Exams Nizamabad | జిల్లా కేంద్రంలో, ఆర్మూర్​లో..
    • SSC Exams Nizamabad | పరీక్ష కేంద్రం నిర్వహణపై కలెక్టర్​ తీవ్ర ఆగ్రహం..

SSC Exams Nizamabad | జిల్లా కేంద్రంలో, ఆర్మూర్​లో..

జిల్లా కేంద్రంలోని బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్ (Blooming Birds School), ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను, సీసీ కెమెరా వ్యవస్థను పరిశీలించారు. విద్యార్థుల హాజరుశాతం, బందోబస్తు, తాగునీరు, ప్రథమ చికిత్స వసతి వంటి వాటిని పరిశీలించారు.

SSC Exams Nizamabad | పరీక్ష కేంద్రం నిర్వహణపై కలెక్టర్​ తీవ్ర ఆగ్రహం..

బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్​లో పరీక్షల నిర్వహణలో పలు లోపాలను గుర్తించిన కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్​కు ఆస్కారం కల్పిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్​కు షోకాజ్​ నోటీసు (Show-cause Notice) ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. తక్షణమే బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్​ను సందర్శించి నిర్వహణాపరమైన లోపాలను చక్కదిద్దాలని సూచించారు. విద్యార్థులు దగ్గర దగ్గరగా కూర్చుండి పరీక్షలు రాస్తున్నారని, మరో ఐదు అదనపు గదులను పరీక్షల నిర్వహణ కోసం వినియోగించాలని, సీటింగ్​ అరేంజ్​మెంట్స్​ పక్కాగా ఉండాలన్నారు.

పరీక్షా కేంద్రాల్లోకి (examination centers) సెల్​ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదన్నారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేలా చూడాలన్నారు. పరీక్షలు పూర్తయ్యేంత వరకు అధికారులు సమన్వయంతో పని చేస్తూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు సత్యకుమారి, ఎస్.వెంకట్రామ్ రెడ్డి ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Municipal Controversy | బల్దియా కమిషనర్, టీపీవోలను సరెండర్ చేయాల్సిందే..: కౌన్సిలర్ల ఏకగ్రీవ తీర్మానం

Mudhiraj Leaders Felicitation | ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తాం
Holi Boy Drowned | హోలీ వేళ విషాదం.. చెరువులో పడి బాలుడి మృతి
Nizamabad outsourcing salary scam | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం..: ఎమ్మెల్యే ధన్​పాల్​
Telangana Education Commission | విద్యా కమిషన్ ఇచ్చిన సిఫార్సులు అశాస్త్రీయం..: టీపీటీఫ్​
Somarpet Villagers Protest | ఎమ్మెల్యేపై సోమార్​పేట్​ గ్రామస్థుల ఆగ్రహం
TAGGED:Blooming Birds SchoolCollector Ila TripathiExamination CentersShow-cause NoticeSSC Exams Nizamabad
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Anganwadi Breakfast Scheme Anganwadi Breakfast Scheme | అంగన్​వాడీ చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం
Next Article Nizamabad outsourcing salary scam | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం..: ఎమ్మెల్యే ధన్​పాల్​ Nizamabad outsourcing salary scam | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం..: ఎమ్మెల్యే ధన్​పాల్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?