అక్షరటుడే, ఇందూరు: SSC Paper Leak | తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎస్సెస్సీ (SSC) పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. మార్చి 18, 2026న జరిగిన రెండో పరీక్ష | లకు సంబంధించిన హిందీ (9H), తెలుగు (9T) ప్రశ్నపత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకోవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. సంబంధిత పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగించి సస్పెండ్ చేశారు.
SSC Paper Leak | సస్పెండ్ అయిన సిబ్బంది వివరాలు..
- బి. రాజేందర్ (GHM, ZPHS డేగావ్, ఆలూర్)
- టి. విజయ్ కుమార్ (SA, ZPHS మచ్చెర్ల, ఆలూర్)
- పి. ఉమేందర్ (SGT, ZPHS మేర్ధపల్లి, ఆలూర్)
- ఎన్. సాగర్ (SGT, MPUPS డీకంపల్లి, ఆలూర్)
- పి. మమత (GHM, ZPHS SRSP, మెండోరా)
- జి. రవీందర్ (SA, ZPHS వెల్గటూర్, మెండోరా)
- సీహెచ్. భూపతి (SA, ZPHS SRSP, మెండోరా)
- కె. వేణు (SA, ZPHS పెంటకాలన్, బోధన్)
- ఎ. శివానందరావు (SA, ZPHS కాల్దుర్కి, బోధన్)
SSC Paper Leak | కఠిన చర్యలు తప్పవు..
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యమైనా సహించేది లేదని స్పష్టం చేశారు. రాబోయే పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. తాజా ఘటన నేపథ్యంలో పరీక్షల పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Silica Gel Uses | సిలికా ప్యాకెట్లతో ఇలా కూడా చేయొచ్చా? చాలామందికి తెలియని ఆ మ్యాజిక్ ఏంటో తెలుసా?

