అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Crash | పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడులతో దలాల్ స్ట్రీట్ రక్తమోడుతోంది. హార్ముజ్ జలసంధి మూసివేతతో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరకు రెక్కలు వచ్చాయి. ముడి చమురు ధరలు 19 నెలల గరిష్టానికి చేరడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లెషన్ పెరగవచ్చన్న ఆందోళన నెలకొంది.
ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మరింతగా దెబ్బతీసింది. గ్లోబల్ మార్కెట్లన్నీ (Global Markets) భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ 8 శాతానికిపైగా పడిపోవడంతో కొంత సేపు ట్రేడింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరగడం, రూపాయి విలువ కొత్త కనిష్టాన్ని నమోదు చేయడంతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సైతం అతలాకుతలమవుతోంది.
Stock Market Crash | 1,710 పాయింట్ల నష్టంతో ప్రారంభమై..
బుధవారం ఉదయం సెన్సెక్స్ 1,710 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. అక్కడినుంచి మరో 85 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో కొంత కోలుకుని 485 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 477 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 83 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి 171 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,307 పాయింట్ల నష్టంతో 78,931 వద్ద, నిఫ్టీ 426 పాయింట్ల నష్టంతో 24,438 వద్ద ఉన్నాయి.
Stock Market Crash | ఐటీ మినహా..
ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు సెల్లాఫ్‌కు గురవుతున్నాయి. నిఫ్టీ (Nifty) ఐటీ ఇండెక్స్ 0.22 శాతం లాభంతో ఉంది. మెటల్ ఇండెక్స్ 4.46 శాతం, రియాలిటీ 3.64 శాతం, మీడియా 3.10 శాతం, కన్జ్జూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్ 2.98 శాతం, ఆటో ఇండెక్స్ 2.73 శాతం,ఆయిల్ అండ్ గ్యాస్ 2.58 శాతం నష్టంతో ఉన్నాయి. పవర్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, యుటిలిటీ, క్యాపిటల్ గూడ్స్ ఇడెక్స్‌లు 2 శాతానికిపైగా నష్టంతో, టెలికాం, ఎఫ్ ఎంసీజీ, హెల్త్‌కేర్, ఎనర్జీ ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా నష్టంతో కదలాడుతున్నాయి.
Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 4 స్టాక్స్ మాత్రమే లాభాలతో ఉండగా.. 26 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్ 1.60 శాతం, ఎయిర్‌టెల్ 1.02 శాతం, టెక్ మహీంద్రా 0.54 శాతం, బీఈఎల్ 0.06 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : టాటా స్టీల్ 6.69 శాతం, ఎల్‌టీ 6.16 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 4.37 శాతం, ఇండిగో 4.07 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.99 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.
ఇది కూడా చదవండి..: Black Monday to Stock Market | స్టాక్ మార్కెట్‌లో బ్లాక్ మండే.. రూ. 7.25 లక్షల కోట్ల సంపద ఆవిరి

