అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Crash | ఇరాన్‌తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలతో ఇన్వెస్టర్లు గందర గోళానికి గురవుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం త్వరలో ముగుస్తుందంటూనే వియత్నాంతో యుద్ధం 19 ఏళ్ల పాటు కొనసాగిందని పేర్కొనడంతో స్టాక్ మార్కెట్లు (Stock Markets) నెగెటివ్‌గా స్పందిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో సూచీలు పతనమవుతున్నాయి.
Stock Market Crash | భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)పై బేర్స్ మళ్లీ పట్టు సాధించారు. గురువారం ఉదయం సెన్సెక్స్ 872 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 717 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 296 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 11 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి మరో 212 పాయింట్లు పడిపోయింది. ఉదయం 10.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,512 పాయింట్ల నష్టంతో 71,621 వద్ద, నిఫ్టీ 473 పాయింట్ల నష్టంతో 22,206 వద్ద కదలాడుతున్నాయి.
Stock Market Crash | రూపాయి బలపడినా..
డాలర్ తో పోల్చితే కొంతకాలంగా బలహీనపడుతూ వస్తున్న రూపాయి విలువ గురువారం భారీగా పెరిగింది. ఇంట్రాడేలో గరిష్టంగా 1.65 పైసల వరకు బలపడడం గమనార్హం. ఉదయం 11 గంటల ప్రాంతంలో 93.5 వద్ద ఉంది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ తీసుకొచ్చిన మార్గదర్శకాలతో బలపడుతోందని భావిస్తున్నారు.
Stock Market Crash | అన్ని రంగాలూ నష్టాల్లోనే..
అన్ని రంగాల షేర్లు నష్టాల బాటలో ఉన్నాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 3.24 శాతం, రియాలిటీ 3.14 శాతం, పవర్ 3.03 శాతం నష్టాలతో ఉండగా.. బ్యాంక్ నిఫ్టీ (Nifty), ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, కన్జూమర్ డ్యూరెబుల్స్, టెలికాం, మీడియా, క్యాపిటల్ గూడ్స్, యుటిలిటీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, మెటల్ ఇండెక్స్‌లు రెండు శాతానికిపైగా నష్టంతో కదలాడుతున్నాయి.
Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 2 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 28 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్ 0.31 శాతం, టీసీఎస్ 0.27 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎటర్నల్ 4.88 శాతం, ఇండిగో 4.18 శాతం, ఎస్‌బీఐ 3.83 శాతం, ఎల్టీ 3.56 శాతం, సన్‌ఫర్మా 3.20 శాతం నష్టంతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: April 02 Gold Rates | పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం, వెండి ధరల్లో మళ్లీ జోష్!
