అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Crash | పశ్చిమాసియాలో సంఘర్షణ నాలుగో వారం కూడా కొనసాగుతుండడమే కాకుండా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని 48 గంటల్లో తెరవకపోతే ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలను తుడిచిపెట్టేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) వార్నింగ్ ఇవ్వగా.. అదే జరిగితే జలసంధిని పూర్తిగా మూసివేస్తామని టెహ్రాన్ హెచ్చరించింది.
దీంతో ముడి చమురుతోపాటు గ్యాస్ సంక్షోభం ఏర్పడుతోంది. ఇది ఇన్ల్ఫెషన్ భయాలను పెంచుతోంది. మరోవైపు రూపాయి విలువలో బలహీనత కొనసాగుతుండడం, ఎఫఐఐలు భారీగా పెట్టుబడులు ఉపసంహరిస్తుండడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
Stock Market Crash | భారీ నష్టాలతో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 800 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 1,174 పాయింట్లు పతనమైంది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనంగా ఉండడంతో బుల్స్‌కు బేర్స్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. నిఫ్టీ 290 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 27 పాయింట్లు పెరిగినా తిరిగి అమ్మకాల ఒత్తిడికి గురై అక్కడినుంచి 380 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 1,836 పాయింట్ల నష్టంతో 72,696 వద్ద, నిఫ్టీ 601 పాయింట్ల నష్టంతో 22,512 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Crash | అన్ని రంగాలూ నష్టాల్లోనే..
బేర్ పట్టు కొనసాగుతుండడంతో అన్ని రంగాలూ భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. కన్జూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్ 4.91 శాతం, మెటల్ ఇండెక్స్ 4.81 శాతం, రియాలిటీ 4.74 శాతం, టెలికాం 4.07 శాతం నష్టపోగా.. క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 3.99 శాతం, మీడియా 3.97 శాతం,బ్యాంకెక్స్ 3.89 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.67 శాతం నష్టపోయాయి.
Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 635 కంపెనీలు లాభపడగా 3,798 స్టాక్స్ నష్టపోయాయి. 123 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 67 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 1,129 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎసఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 13.6 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది.
Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 4 కంపెనీలు లాభాలతో, 26 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. హెచ్‌సీఎల్ టెక్ 2.10 శాతం, పవర్‌గ్రిడ్ 0.67 శాతం, ఇన్ఫోసిస్ 0.28 శాతం, టెక్ మహీంద్రా 0.19 శాతం లాభపడ్డాయి.
Top losers : టైటాన్ 6.24 శాతం, ట్రెంట్ 5.90 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 5.40 శాతం, బీఈఎల్ 4.85 శాతం, టాటా స్టీల్ 4.80 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Gold Price Fall | దిగివస్తున్న బంగారం ధర.. ఆల్ టైం హైనుంచి సగం తగ్గిన వెండి

