అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Crash | పశ్చిమాసియాలో చెలరేగిన ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్ (Stock Market)లో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఘర్షణలతో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలు రావడం, రూపాయి విలువ భారీగా పడిపోవడం, గ్లోబల్ మార్కెట్లు సైతం తీవ్ర ఒత్తిడిలో ఉండడంతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) సైతం భారీ నష్టాలతో సాగుతోంది.
Stock Market Crash | క్రూడ్ ఆయిల్ ధర పెరగడంతో
సోమవారం ఉదయం సెన్సెక్స్ 2,744 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా వెంటనే 2,089 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 519 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 14 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి 330 పాయింట్లు పెరిగింది. మార్కెట్ కోలుకుంటున్నట్లు కనిపించినా కొద్దిసేపటికే మళ్లీ సూచీలు పతనమయ్యాయి. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,143 పాయింట్ల నష్టంతో 80,144 వద్ద, నిఫ్టీ 338 పాయింట్ల నష్టంతో 24,840 వద్ద ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర గణనీయంగా పెరగడంతో చమురు మార్కెటింగ్ కంపెనీలతోపాటు పెయింట్, టైర్, రసాయనాల తయారీ సంస్థలు, విమానయాన రంగంలోని స్టాక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
Stock Market Crash | అన్ని రంగాల్లో సెల్లాఫ్..
అన్ని రంగాల షేర్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. నిఫ్టీ (Nifty) ఆటో ఇండెక్స్ 2.60 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 2.10 శాతం, యుటిలిటీ 2.08 శాతం నష్టపోగా.. ఎనర్జీ 1.81 శాతం, రియాలిటీ 1.77 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.75 శాతం, పవర్ 1.66 శాతం, మీడియా 1.65 శాతం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఐటీ రంగాల షేర్లు ఒక శాతానికిపైగా నష్టంతో కొనసాగుతున్నాయి.
Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 3 స్టాక్స్ మాత్రమే లాభాలతో ఉండగా.. 27 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. బీఈఎల్ 2.26 శాతం, ఎయిర్‌టెల్ 0.48 శాతం, సన్‌ఫార్మా 0.34 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎల్‌టీ 5.76 శాతం, ఇండిగో 4.27 శాతం, అదానిపోర్ట్స్ 3.68 శాతం, మారుతి 3.22 శాతం, ఎంఅండ్ఎం 3.12 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.
ఇది కూడా చదవండి..: Gift Nifty Gapdown | మార్కెట్‌లో యుద్ధభయాలు.. గ్యాప్‌డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ

