Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Crash | మళ్లీ కుప్పకూలిన మార్కెట్లు.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Crash | మళ్లీ కుప్పకూలిన మార్కెట్లు.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

బిజినెస్​

Stock Market Crash | మళ్లీ కుప్పకూలిన మార్కెట్లు.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 1,097 పాయింట్లు, నిఫ్టీ 315 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 6, 2026 4:39 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
stock market crash
stock market crash

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Crash | జియో పొలిటికల్ టెన్షన్స్ కొనసాగుతుండడంతో క్రూడ్ ఆయిల్ ధరలు పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. బ్యారెల్ రేటు 87.5 డాలర్లు దాటింది.

Contents
  • Stock Market Crash | నష్టాలతో ప్రారంభమై..
    • Stock Market Crash | క్యాపిటల్ గూడ్స్, పవర్ సెక్టార్లు మినహా..
    • Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలతోపాటు గ్లోబల్ మార్కెట్ల (Global Markets)లో వీక్‌నెస్, రూపాయి బలహీనత, ఎఫ్ఐఐల పెట్టుబడులు ఉపసంహరణ, గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ భారత స్టాక్ మార్కెట్ (Indian Stock Market) వెయిటేజీని తగ్గించడం వంటి కారణాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది.

Stock Market Crash | నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలతో ప్రారంభమై భారీ నష్టాల్లోకి జారుకుంది. ఉదయం సెన్సెక్స్ 357 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 95 పాయింట్లు పైకి ఎగబాకింది. అక్కడినుంచి క్రమంగా పడిపోతూ 941 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 109 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 44 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి క్రమంగా క్షీణిస్తూ 285 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 1,097 పాయింట్ల నష్టంతో 78,918 వద్ద, నిఫ్టీ 315 పాయింట్ల నష్టంతో 24,450 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Crash | క్యాపిటల్ గూడ్స్, పవర్ సెక్టార్లు మినహా..

క్యాపిటల్ గూడ్స్, పవర్, ఐటీ సెక్టార్లు మినహా మిగిలిన అన్ని రంగాల ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ (Nifty) క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.30 శాతం, పవర్ 0.44 శాతం, యుటిలిటీ 0.73 శాతం, ఐటీ 0.04 శాతం లాభపడ్డాయి. రియాలిటీ ఇండెక్స్ 2.08 శాతం, బ్యాంక్ నిఫ్టీ 2.15 శాతం, ఫైనాన్షియల్ ఇండెక్స్ 2.12 శాతం, ఆటో 1.06 శాతం నష్టంతో ముగిశాయి.

Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,895 కంపెనీలు లాభపడగా 2,304 స్టాక్స్ నష్టపోయాయి. 175 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 69 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 258కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 7 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 11 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 2.70 లక్షల కోట్లమేర తగ్గింది.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 7 కంపెనీలు లాభాలతో, 23 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బీఈఎల్ 1.82 శాతం, రిలయన్స్ 1.11 శాతం, సన్‌ఫార్మా 0.68, ఎన్టీపీసీ 0.61 శాతం, పవర్‌గ్రిడ్ 0.35 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఎటర్నల్ 3.39 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 3.39 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.58 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.56 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.39 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Losses | తగ్గని ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

March 17 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్ ముందు మధ్యతరగతికి కాస్త ఊరట
Women Workforce India | సంప్రదాయేతర రంగాల్లో మహిళల ముద్ర: కార్యాలయాల్లో మార్పు అనివార్యం
March 09 Gold Silver Rates | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా పరిస్థితి ఇదే!
ధోనీ ‘నంబర్ 8’ సీక్రెట్ రివీల్.. నిద్రలేమిపై ‘ది స్లీప్ కంపెనీ’తో కలిసి మిస్టర్ కూల్ జాతీయ ఉద్యమం!
Stock Market Volatility | వీడని యుద్ధ భయాలు.. లాభనష్టాల మధ్య ఊగిసలాటలో మార్కెట్లు
TAGGED:Global MarketsIndian Stock MarketNiftyStock Market Crash
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Science Fair Students Creativity | సైన్స్‌ ఫెయిర్‌తో విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది.. Science Fair Students Creativity | సైన్స్‌ ఫెయిర్‌తో విద్యార్థుల్లో సృజనాత్మకత
Next Article Women Empowerment Women Empowerment | మహిళలకు సమానావకాశాలు కల్పిస్తూ సమాజాభివృద్ధికి కృషి: మంత్రి సీతక్క
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?