Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Crash | బేర్ దెబ్బకు విలవిల్లాడుతున్న ఇన్వెస్టర్లు.. రూ. 9.71 లక్షల కోట్ల సంపద ఆవిరి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Crash | బేర్ దెబ్బకు విలవిల్లాడుతున్న ఇన్వెస్టర్లు.. రూ. 9.71 లక్షల కోట్ల సంపద ఆవిరి

బిజినెస్​

Stock Market Crash | బేర్ దెబ్బకు విలవిల్లాడుతున్న ఇన్వెస్టర్లు.. రూ. 9.71 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్ బేర్ గుప్పిట్లోకి వెళ్లిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. సెన్సెక్స్ 1,470 పాయింట్లు, నిఫ్టీ 488 పాయింట్లు కోల్పోయాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 13, 2026 4:48 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Stock Market Crash

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market Crash | అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం ముగింపునకు సంబంధించి ఎటువంటి సంకేతాలు అందకపోవడంతో స్టాక్ మార్కెట్‌ (Stock Market) లో బేర్ హవా కొనసాగుతోంది. దీంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు.

Contents
  • Stock Market Crash | అన్ని రంగాల్లో సెల్లాఫ్..
    • Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

శTక్రవారం ఉదయం సెన్సెక్స్ 590 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మొదట్లో 132 పాయింట్లు పెరిగింది. తిరిగి అమ్మకాల ఒత్తిడితో 1,122 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 177 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 30 పాయింట్లు పెరిగినా నిలదొక్కుకోలేకపోయింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 380 పాయింట్లు పడిపోయింది. చివరికి సెన్సెక్స్ 1,470 పాయింట్ల నష్టంతో 74,563 వద్ద, నిఫ్టీ 488 పాయింట్ల నష్టంతో 23,151 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Crash | అన్ని రంగాల్లో సెల్లాఫ్..

పశ్చిమాసియాలో అనిశ్చిత పరిస్థితులు, క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరల పెరుగుదల, ఎఫఐఐల నిరంతర అమ్మకాలు, రూపాయి రోజుకో జీవనకాల కనిష్టాన్ని నమోదు చేస్తుండడం వంటి కారణాలతో అన్ని రంగాలలో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో అన్ని ప్రధాన రంగాల ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి. నిఫ్టీలో (Nifty) మెటల్ ఇండెక్స్ 4.82 శాతం, ఆటో ఇండెక్స్ 3.60 శాతం, మీడియా 3.56 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.99 శాతం, టెలికాం 2.57 శాతం, బ్యాంక్ నిఫ్టీ 2.44 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 2.36 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 2.18 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.05 శాతం, పవర్ 1.91 శాతం, ఫార్మా 1.90 శాతం నష్టపోయాయి.

Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 941 కంపెనీలు లాభపడగా 3,348 స్టాక్స్ నష్టపోయాయి. 132 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 55 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 563 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 16 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్ఈలో నమోదు అయిన కంపెనీల సంపద విలువ రూ. 9.71 లక్షల కోట్ల మీద తగ్గింది.

Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 2 కంపెనీలు లాభాలతో, 28 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. హెచ్‌యూఎల్ 1.18 శాతం, ఎయిర్‌టెల్ 0.33 శాతం లాభపడ్డాయి.
Top losers : ఎల్‌టీ 7.52 శాతం, టాటా స్టీల్ 5.20 శాతం, ఎస్‌బీఐ 3.55 శాతం, బీఈఎల్ 3.12 శాతం, మారుతి 3.12 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: TVS Orbiter V1 | రూ.49,999 లకే టీవీఎస్ ఈవీ స్కూటర్.. ఆర్బిటర్ వీ1 ను లాంచ్ చేసిన కంపెనీ

March 12 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Ramky | దిఘి పోర్ట్ ఇండస్ట్రియల్ ఏరియా ప్రాజెక్టును దక్కించుకున్న రామ్‌కీ ఇన్‌ఫ్రా
Stock Market Fall | కొనసాగుతున్న పతనం.. బేర్ గుప్పిట్లో స్టాక్ మార్కెట్లు
March 10 Gold Silver Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
CDK india | ‘సీడీకే’ కన్వర్జెన్స్ 2026.. ఉద్యోగుల కుటుంబాలతో కలిసి భారతీయ మూలాల వేడుక
TAGGED:crude oil price surgeFII selling Indiaglobal market impactIndian stock market newsinvestor wealth lossNifty declineSensex fall todayStock Market Crash
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article National Lok Adalat National Lok Adalat | లోక్ అదాలత్​ను సద్వినియోగం చేసుకోవాలి : సీపీ సాయి చైతన్య
Next Article Watermelon Health Benefits | పుచ్చకాయను ఇష్టంగా తింటారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే! Watermelon Health Benefits | పుచ్చకాయను ఇష్టంగా తింటారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?