అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Crash | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. హార్ముజ్ జలసంధి
(Strait of Hormuz)ని 48 గంటల్లో తెరవకపోతే ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలను తుడిచిపెట్టేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇవ్వగా.. అదే జరిగితే జలసంధిని పూర్తిగా మూసివేస్తామని టెహ్రాన్ హెచ్చరించింది.
దీంతో చమురు ధరలు 50 శాతానికిపైగా జంప్ అవడంతోపాటు గ్యాస్ కష్టాలు మరింత పెరిగే అవకాశాలు ఉండడంతో అంతటా ఆందోళన నెలకొంది. మరోవైపు రూపాయి విలువ రోజురోజుకు జీవనకాల కనిష్టాలను నమోదు చేస్తుండడం, ఫారిన్ ఇన్‌స్టిట్యూనల్ ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు ఉపసంహరిస్తుండడంతో ఇన్వెస్టర్లు నీరుగారిపోతున్నారు.
Stock Market Crash | నష్టాలు కంటిన్యూ..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) నూతన వారాన్ని సైతం భారీ నష్టాలతో ప్రారంభించింది. గ్లోబల్ సంకేతాలకు అనుగుణంగా సోమవారం ఉదయం సెన్సెక్స్ 800 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి మరో 1,104 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 290 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 27 పాయింట్లు పెరిగినా నిలదొక్కుకోలేకపోయింది. అక్కడినుంచి 347 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,745 పాయింట్ల నష్టంతో 72,787 వద్ద, నిఫ్టీ 565 పాయింట్ల నష్టంతో 22,548 వద్ద కదలాడుతున్నాయి.
Stock Market Crash | అన్ని రంగాల్లో భారీ సెల్లాఫ్..
అన్ని రంగాలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4.48 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 4.47 శాతం, రియాలిటీ 4.32 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్ 4.18 శాతం నష్టపోగా.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, టెలికాం, మీడియా, పవర్ ఇండెక్స్ లు 3 శాతానికిపై నష్టంతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 3 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 27 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్ 1.27 శాతం, టెక్ మహీంద్రా 0.57 శాతం, పవర్‌గ్రిడ్ 0.56 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఇండిగో 5.47 శాతం, అదానీపోర్ట్స్ 4.84 శాతం, ట్రెంట్ 4.48 శాతం, బజాజ్ ఫైనాన్స్ 4.43 శాతం, టైటాన్ 4.34 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Realme P4 Lite 5G | సరికొత్త రియల్‌మీ ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

