అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Crash | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బేర్స్ దెబ్బకు విలవిల్లాడుతోంది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. సోమవారం ఉదయం సెన్సెక్స్ 1,018 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 174 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి 774 పాయింట్లు పెరిగింది.
నిఫ్టీ(Nifty) 270 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 79 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి 244 పాయింట్లు పైకి ఎగబాకింది. అయితే గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో సూచీలు మళ్లీ భారీగా పతనమయ్యాయి. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 1,164 పాయింట్ల నష్టంతో 72,419 వద్ద, నిఫ్టీ 346 పాయింట్ల నష్టంతో 22,473 వద్ద కదలాడుతున్నాయి.
Stock Market Crash | ఎనర్జీ మినహా..
ఎనర్జీ సెక్టార్ మినహా మిగిలిన అన్ని రంగాల ఇండెక్స్‌లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 2.67 శాతం, రియాలిటీ 2.57 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.37 శాతం, టెలికాం 2.13 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. ఎనర్జీ ఇండెక్స్ 0.18 శాతం లాభంతో ఉండగా.. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ సెక్టార్లు స్వల్ప లాభాలతో సాగుతున్నాయి.
Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 2 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 28 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. బీఈఎల్ 0.31 శాతం, పవర్‌గ్రిడ్ 0.15 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : యాక్సిస్ బ్యాంక్ 3.90 శాతం, కొటక్ బ్యాంక్ 3.55 శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.06 శాతం, ఎస్‌బీఐ 2.68 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.45 శాతం నష్టంతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: March 30 Gold Rates | కాస్త ఊరట.. దేశంలో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
