Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Fall | స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. రూ. 9 లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Fall | స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. రూ. 9 లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు

బిజినెస్​తాజా వార్తలు

Stock Market Fall | స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. రూ. 9 లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు

పశ్చిమాసియా అట్టుడుకుతోంది. దాడులు, ప్రతిదాడుల ప్రకంపనలు స్టాక్ మార్కెట్‌ను షేక్ చేస్తున్నాయి. సెన్సెక్స్ 1,122 పాయింట్లు, నిఫ్టీ 385 పాయింట్లు క్షీణించాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 4, 2026 4:30 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Stock Market Fall
Stock Market Fall

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Fall  | అమెరికా, ఇరాన్‌ల మధ్య మొదలైన యుద్ధం ఐదో రోజూ కొనసాగుతోంది. దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. హార్ముజ్ జలసంధి మూసివేతతో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు 19 నెలల గరిష్టానికి చేరాయి. ఇది ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

Contents
  • Stock Market Fall | భారీ నష్టాలతో ప్రారంభం..
    • Stock Market Fall | ఐటీ మినహా..
      • Stock Market Fall | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

ముడి చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం కట్టుతప్పే ప్రమాదం ఉండడంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురై అమ్మకాలకు పాల్పడుతున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు రక్తమోడుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరగడం, రూపాయి విలువ కొత్త కనిష్టాన్ని నమోదు చేయడంతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) భారీగా పతనమైంది.

Stock Market Fall | భారీ నష్టాలతో ప్రారంభం..

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం భారీ గ్యాప్ డౌన్‌తో ప్రారంభమైంది. బుధవారం ఉదయం సెన్సెక్స్ 1,710 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 85 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో 1,084 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 477 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 83 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి 297 పాయింట్లు పెరిగింది. మార్కెట్లు యుద్ధ భయాలనుంచి తేరుకుంటున్నట్లు కనిపించినా.. చివరి అరగంటలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడడంతో సూచీలు పతనమయ్యాయి. చివరికి సెన్సెక్స్ 1,122 పాయింట్ల నష్టంతో 79,116 వద్ద, నిఫ్టీ 385 పాయింట్ల నష్టంతో 24,480 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Fall | ఐటీ మినహా..

ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు సెల్లాఫ్‌కు గురయ్యాయి. నిఫ్టీ (Nifty) ఐటీ ఇండెక్స్ 0.11 శాతం పెరిగింది. మెటల్ ఇండెక్స్ 3.99 శాతం, రియాలిటీ 3.11 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 3.09 శాతం, మీడియా 3.05 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 2.64 శాతం, పవర్ 2.59 శాతం, ఆటో ఇండెక్స్ 2.44 శాతం, ఎనర్జీ 2.23 శాతం, యుటిలిటీ 2.19 శాతం క్షీణించాయి.

Stock Market Fall | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,053 కంపెనీలు లాభపడగా 3,245 స్టాక్స్ నష్టపోయాయి. 135 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 53 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 719 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 9 లక్షల కోట్లమేర ఆవిరయ్యింది.

Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 3 కంపెనీలు లాభాలతో, 27 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎయిర్‌టెల్ 1.78 శాతం, ఇన్ఫోసిస్ 1.50 శాతం, టెక్ మహీంద్రా 0.51 శాతం లాభపడ్డాయి.

Losers : టాటా స్టీల్ 6.76 శాతం, ఎల్‌టీ 4.53 శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.36 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 3.32 శాతం, ఎన్టీపీసీ 3.07 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Crude Oil Prices | కలవరపెడుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు.. భారీ నష్టాల్లో గ్లోబల్ మార్కెట్లు

South Central Railway Offer | ఒకే టికెట్‌తో వేర్వేరు తీర్థయాత్రలు.. సౌత్ సెంట్రల్ రైల్వే సూపర్ ఆఫర్
Arunachalam Train Services | రెగ్యులర్​ సర్వీస్​గా నాంపల్లి – కన్యాకుమారీ వీక్లీ ఎక్స్​ప్రెస్​
Stock Market Holidays | మార్చిలో భారీగా సెలవులు.. ఏకంగా 12 రోజులు మూసి ఉండనున్న స్టాక్ మార్కెట్లు
Telangana SSC Exams | పదో తరగతి పరీక్షలు రద్దు చేయ‌బోతున్నారా.. తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ!
Tata Motors March Offers | ‘టాటా మోటార్స్ మార్చి ఆఫర్స్.. డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా..
TAGGED:Crude OilDalal Street updateIndian share market newsInflation fears marketInvestors loss IndiaNifty decline newsSensex crash todayStock market fallUS Iran war impact
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Nizamabad Congress Meeting Nizamabad Congress Meeting | సమష్టిగా కాంగ్రెస్​ పార్టీని ముందుకు తీసుకెళ్తాం..
Next Article Bhadrachalam Talambralu Bhadrachalam Talambralu | ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు.. టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవ
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?