Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Fall | వరుస లాభాలకు బ్రేక్.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Fall | వరుస లాభాలకు బ్రేక్.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

బిజినెస్​

Stock Market Fall | వరుస లాభాలకు బ్రేక్.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

పశ్చిమాసియాలో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురవుతుండడంతో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు, నిఫ్టీ 222 పాయింట్లు నష్టపోయాయి.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 9, 2026 4:27 సా.
Srinivas Kolluri
3 గంటలు ago
Share
Stock Market Fall

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Fall | లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడులు కొనసాగిస్తే అమెరికాతో చర్చల నుంచి వైదొలుగుతామని ఇరాన్ హెచ్చరించడంతో పశ్చిమాసియాలో అనిశ్చితి నెలకొంది.

Contents
  • Stock Market Fall | నష్టాలతో ప్రారంభమై..
    • Stock Market Fall | రాణించిన క్యాపిటల్ గూడ్స్, మెటల్ సెక్టార్లు..
      • Stock Market Fall | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

అమెరికా -ఇరాన్ మధ్య శాశ్వత కాల్పుల విరమణపై ఆశలు సన్నగిల్లుతుండడం, క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు పెరుగుతుండడంతో పెట్టుబడిదారులు అప్రమత్తమయ్యారు. ప్రధాన గ్లోబల్ మార్కెట్లు సైతం ఎరుపెక్కాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఐదు వరుస సెషన్ల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్‌లో లాభాలకు బ్రేక్ పడింది. ప్రధాన ఈక్విటీ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ గురువారం నష్టాలతో ముగిశాయి.

Stock Market Fall | నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గురువారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 243 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా పుంజుకుని 110 పాయింట్లు ఎగబాకింది. అక్కడినుంచి అమ్మకాల ఒత్తిడితో 1,082 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 88 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 81 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద లాభాల స్వీకరణతో 308 పాయింట్లు కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 931 పాయింట్ల లాభంతో 76,631 వద్ద, నిఫ్టీ 222 పాయింట్ల లాభంతో 23,775 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Fall | రాణించిన క్యాపిటల్ గూడ్స్, మెటల్ సెక్టార్లు..

క్యాపిటల్ గూడ్స్, పవర్, మెటల్ సెక్టార్లు రాణించగా.. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇండెక్స్‌లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ (Nifty)లో క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.64 శాతం, పవర్ 1.27 శాతం, మెటల్ 1.25 శాతం, యుటిలిటీ 0.69 శాతం, ఫార్మా 0.66 శాతం లాభపడగా.. బ్యాంక్ నిఫ్టీ 1.58 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.41 శాతం, మీడియా 0.39 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.53 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.39 శాతం, ఆటో 0.39 శాతం నష్టపోయాయి.

Stock Market Fall | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,150 కంపెనీలు లాభపడగా 2,137 స్టాక్స్ నష్టపోయాయి. 133 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 109 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 28 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 9 కంపెనీలు లాభాలతో, 21 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బీఈఎల్ 1.57 శాతం, పవర్‌గ్రిడ్ 1.12 శాతం, ఎన్టీపీసీ 1.12 శాతం, టీసీఎస్ 1.09 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.60 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఇండిగో 3.64 శాతం, ఎల్‌టీ 2.75 శాతం, ఎటర్నల్ 2.34 శాతం, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 2.31 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.18 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: OnePlus Nord 6 | అత్యాధునిక ఫీచర్లతో వన్‌ప్లస్ ఫోన్

Stock Market Loss | భారీ నష్టాల్లో సూచీలు.. రూ. 9.19 లక్షల కోట్ల సంపద ఆవిరి
Stock Market Crash | తీవ్ర ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు
Stock Market Gains | ఐటీ, ఆటో సెక్టార్లలో జోరు.. భారీ లాభాల దిశగా సూచీలు
Indian Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. స్వల్ప లాభాల్లో సూచీలు
Stock Market Losses | నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
TAGGED:Crude Oilcrude oil pricesDomestic Stock MarketGlobal MarketsIndian Stock Marketmarket lossesNiftyNifty TodaySensex TodayStock MarketStock market fallstock market news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Social Service Initiative Social Service Initiative | సమాజ సేవలో ముందుండాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​
Next Article zoom జూమ్ భారీ విస్తరణ.. ఆరు టెలికాం సర్కిళ్లలో ‘నేటివ్ ఇండియా’ ఫోన్ నంబర్లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?