Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Fall | కొనసాగుతున్న పతనం.. బేర్ గుప్పిట్లో స్టాక్ మార్కెట్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Fall | కొనసాగుతున్న పతనం.. బేర్ గుప్పిట్లో స్టాక్ మార్కెట్లు

బిజినెస్​

Stock Market Fall | కొనసాగుతున్న పతనం.. బేర్ గుప్పిట్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. సెన్సెక్స్ 829 పాయింట్లు, నిఫ్టీ 227 పాయింట్లు కోల్పోయాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 12, 2026 4:51 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Stock Market Fall

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market Fall | అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాడులు, ప్రతిదాడులతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీంతో క్రూడ్ ఆయిల్ (Crude oil) ధరలు మళ్లీ బ్యారెల్‌కు వంద డాలర్లకు చేరువయ్యాయి. మరోవైపు మన రూపాయి విలువ మరోసారి జీవన కాల కనిష్టాలను నమోదు చేసింది.

Contents
  • Stock Market Fall | భారీ నష్టాలతో ప్రారంభమై..
    • Stock Market Fall | రాణించిన యుటిలిటీ, పవర్ సెక్టార్లు..
      • Stock Market Fall | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

దీని ప్రభావం స్టాక్ మార్కెట్లపై (Stock Markets) కనిపించింది. భారత జెండాతో కూడిన చమురు ట్యాంకర్లు హర్ముజ్ జలసంధి మీదుగా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించిందన్న వార్తలతో మార్కెట్లు కాస్త తేరుకున్నా.. భారత్ సహా 16 దేశాలపై అదనపు సుంకాలను విధించడం కోసం ట్రంప్ సెక్షన్ 301ను ప్రయోగించనున్నారన్న వార్తలతో చివరి రెండు గంటల్లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో సూచీలు మళ్లీ పతనమయ్యాయి.

Stock Market Fall | భారీ నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గురువారం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 494 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 498 పాయింట్లు క్షీణించింది. అక్కడినుంచి కాస్త కోలుకుని 810 పెరిగింది. నిఫ్టీ 192 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 118 పాయింట్లు నష్టపోయింది. అక్కడినుంచి కోలుకుని 277 పాయింట్లు పెరిగింది. మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. చివరికి సెన్సెక్స్ 829 పాయింట్ల నష్టంతో 76,034 వద్ద, నిఫ్టీ 227 పాయింట్ల నష్టంతో 23,639 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Fall | రాణించిన యుటిలిటీ, పవర్ సెక్టార్లు..

యుటిలిటీ, పవర్, ఎనర్జీ సెక్టార్లు రాణించినా మిగతా ఇండెక్స్‌లు నష్టాల బాటలో సాగాయి. నిఫ్టీలో యుటిలిటీ ఇండెక్స్ 3.31 శాతం, పవర్ 2.51 శాతం, ఎనర్జీ 1.06 శాతం పెరిగాయి. ఆటో ఇండెక్స్ 3.19 శాతం, ఎఫ్ఎంసీజీ 1.77 శాతం, రియాలిటీ 1.63 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.14 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.01 శాతం నష్టపోయాయి.

Stock Market Fall | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,713 కంపెనీలు లాభపడగా 2,516 స్టాక్స్ నష్టపోయాయి. 175 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 68 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 378 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.

Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 6 కంపెనీలు లాభాలతో, 24 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎన్టీపీసీ 2.79 శాతం, పవర్‌గ్రిడ్ 1.64 శాతం, టెక్ మహీంద్రా 1.61 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.71 శాతం, రిలయన్స్ 0.05 శాతం లాభపడ్డాయి.

Top losers : ఎంఅండ్ఎం 4.23 శాతం, మారుతి 3.60 శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.31 శాతం, ఎల్‌టీ 3.06 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.90 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: March 12 Gold Prices | మళ్లీ ఎగబాకిన బంగారం ధర.. కిలో వెండి రూ.3 లక్షలకు చేరువలో!

Stock Market Volatility | ప్రారంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
March 14 Gold Rates | మహిళలకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Pakistan Stock Market Crash | కుప్పకూలిన పాకిస్తాన్‌ స్టాక్‌ మార్కెట్‌.. 45 నిమిషాలు నిలిచిపోయిన ‍ట్రేడింగ్‌
March 10 PRE Market Analysis | శాంతించిన క్రూడ్ ఆయిల్ ధర.. పరుగులు తీస్తున్న గ్లోబల్ మార్కెట్లు
Stock Market War Fears | వీడని యుద్ధ భయాలు.. భారీ నష్టాల్లో సూచీలు
TAGGED:Crude Oilcrude oil price impactDomestic Stock Marketglobal market volatilityIndian share market newsinvestors profit bookingsensex nifty declineStock MarketStock market fallstock market update indiaus iran tensions markets
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Half Day Schools Half Day Schools | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. 15 నుంచి ఒంటిపూట బడులు
Next Article Rupee Record Low Rupee Record Low | వణికిపోతున్న రూపాయి.. డాలర్‌తో రూ. 92.36కు పడిపోయిన విలువ
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?