Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Gains | బుల్స్‌కు బూస్ట్ ఇచ్చిన సీజ్ ఫైర్.. రూ. 16.80 లక్షల కోట్లు పెరిగిన సంపద
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Gains | బుల్స్‌కు బూస్ట్ ఇచ్చిన సీజ్ ఫైర్.. రూ. 16.80 లక్షల కోట్లు పెరిగిన సంపద

బిజినెస్​

Stock Market Gains | బుల్స్‌కు బూస్ట్ ఇచ్చిన సీజ్ ఫైర్.. రూ. 16.80 లక్షల కోట్లు పెరిగిన సంపద

అమెరికా, ఇరాన్‌ల మధ్య సీజ్ ఫైర్.. బుల్స్‌కు బూస్ట్ ఇచ్చింది. వరుసగా ఐదో సెషన్‌లోనూ దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 2,946 పాయింట్లు, నిఫ్టీ 873 పాయింట్లు పెరిగాయి.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 8, 2026 4:53 సా.
Srinivas Kolluri
6 గంటలు ago
Share
Stock Market Gains

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Gains | అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదరడంతో స్టాక్ మార్కెట్లు (Stock Market) పుంజుకున్నాయి. ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ తో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర తగ్గడం, డాలర్ విలువ క్షీణించడం, రూపాయి బలపడడం, ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచకుండా యథాతథంగా కొనసాగించడం వంటి కారణాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దలాల్ స్ట్రీట్‌లో బుల్స్ రంకెలు వేయడంతో సెన్సెక్స్, నిఫ్టీలు 4 శాతానికిపైగా లాభపడ్డాయి. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత వరుసగా ఐదు సెషన్లపాటు మన మార్కెట్లు లాభాలతో ముగియడం ఇదే మొదటిసారి.

Contents
  • Stock Market Gains | భారీ లాభాలతో ప్రారంభం..
    • Stock Market Gains | అన్ని సూచీలు లాభాల్లోనే..
      • Stock Market Gains | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

Stock Market Gains | భారీ లాభాలతో ప్రారంభం..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం భారీ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 2,674 పాయింట్ల లాభంతో ప్రారంభమై మొదట్లో కాస్త దిద్దుబాటుకు గురై 250 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి పుంజుకుని 593 పాయింట్లు పైకి ఎగబాకింది. నిఫ్టీ 732 పాయింట్ల లాభంతో ప్రారంభమై 27 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 197 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 2,946 పాయింట్ల లాభంతో 77,562 వద్ద, నిఫ్టీ 873 పాయింట్ల లాభంతో 23,997 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Gains | అన్ని సూచీలు లాభాల్లోనే..

దేశీయ స్టాక్ మార్కెట్‌లోని అన్ని ఇండెక్స్‌లు లాభాల్లో సాగుతున్నాయి. నిఫ్టీలో రియాలిటీ ఇండెక్స్ 6.75 శాతం, ఆటో ఇండెక్స్ 6.69 శాతం, బ్యాంక్ నిఫ్టీ 5.67 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 5.48 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 5.15 శాతం పెరిగాయి.

Stock Market Gains | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 3,859 కంపెనీలు లాభపడగా 537 స్టాక్స్ నష్టపోయాయి. 101 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 99 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 28 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 16.80 లక్షల కోట్ల మేర పెరిగింది.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 20 కంపెనీలు లాభాలతో, 10 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఇండిగో 8.22 శాతం, ఎల్‌టీ 7.64 శాతం, బజాజ్ ఫైనాన్స్ 7.03 శాతం, ఎంఅండ్ ఎం 6.79 శాతం, యాక్సిస్ బ్యాంక్ 6.56 శాతం లాభపడ్డాయి.

Losers : టెక్ మహీంద్రా 1.53 శాతం, సన్‌ఫార్మా 0.29 శాతం, పవర్‌గ్రిడ్ 0.20 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Crude Oil Prices Drop | సీజ్ ఫైర్ ప్రకటన.. భారీగా పడిపోయిన చమురు ధరలు

CDK india | ‘సీడీకే’ కన్వర్జెన్స్ 2026.. ఉద్యోగుల కుటుంబాలతో కలిసి భారతీయ మూలాల వేడుక
March 30 Gold Rates | కాస్త‌ ఊరట.. దేశంలో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
తెలంగాణలో సరికొత్త రెనాల్ట్ డస్టర్‌ను విడుదల చేసిన పీపీఎస్ మోటార్స్
March 18 Pre Market Analysis | లాభాల్లో గిఫ్ట్ నిఫ్టీ.. గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ
April 07 Pre Market Analysis | మిక్స్‌డ్ ఆసియా మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
TAGGED:Crude OilDomestic Stock MarketStock MarketStock Market Gains
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article RTC Relay Hunger Strike | RTC Relay Hunger Strike | ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల రిలే నిరాహార దీక్ష
Next Article Kandukurthi Development Kandukurthi Development | కందకుర్తి అభివృద్ధిపై ఎంపీ అర్వింద్ ప్రత్యేక దృష్టి.. మంత్రి కోమటిరెడ్డిని కలిసి చర్చ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?