అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Loss India | పశ్చిమాసియాలో సంఘర్షణ కొనసాగుతుండడం, చర్చల విషయంలో అమెరికా, ఇరాన్ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండడం వంటి కారణాలు పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచుతున్నాయి. దీంతో వారు ప్రాఫిట్ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుండడంతో స్టాక్ మార్కెట్లు (Stock Markets) బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి.
Stock Market Loss India | రూపాయి విలువ పడిపోతుండడంతో
శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 390 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 21 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 916 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 133 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 13 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 259 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,216 పాయింట్ల నష్టంతో 74,056 వద్ద, నిఫ్టీ 357 పాయింట్ల నష్టంతో 22,949 వద్ద కదలాడుతున్నాయి. క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర పెరుగుతుండడం, రూపాయి విలువ పడిపోతుండడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుండడంతో సూచీలు భారీగా పతనమవుతున్నాయి.
Stock Market Loss India | ఐటీ మినహా అన్నీ నష్టాల్లోనే..
ఐటీ ఇండెక్స్ మినహా మిగిలిన అన్ని రంగాల ఇండెక్స్‌లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.08 శాతం లాభంతో ఉంది. మీడియా ఇండెక్స్ 3.17 శాతం, రియాలిటీ 2.72 శాతం, ఆటో 2.61 శాతం, బ్యాంక్ నిఫ్టీ 2.22 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 2.22 శాతం నష్టాలతో ఉన్నాయి.
Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 2 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 28 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్ 1.17 శాతం, సన్‌ఫార్మా 0.56 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఇండిగో 4.02 శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.63 శాతం, రిలయన్స్ 3.33 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.69 శాతం, హెచ్‌డీఎఫ్ సీ బ్యాంక్ 2.52 శాతం నష్టంతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి : March 27 Gold Rates | మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళన!

