Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Loss | భారీ నష్టాల్లో సూచీలు.. రూ. 9.19 లక్షల కోట్ల సంపద ఆవిరి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Loss | భారీ నష్టాల్లో సూచీలు.. రూ. 9.19 లక్షల కోట్ల సంపద ఆవిరి

బిజినెస్​

Stock Market Loss | భారీ నష్టాల్లో సూచీలు.. రూ. 9.19 లక్షల కోట్ల సంపద ఆవిరి

పశ్చిమాసియలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్ నష్టాల బాటలో పయనించింది. సెన్సెక్స్ 1,635 పాయింట్లు, నిఫ్టీ 488 పాయింట్లు నష్టపోయాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 4:47 సా.
Srinivas Kolluri
6 గంటలు ago
Share
Stock Market Loss

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Loss | పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం ఐదో వారంలోకి ప్రవేశించింది. ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియక మదుపరులు ఆందోళన చెందుతున్నారు. ఇరాన్‌కు మద్దతుగా హూతీ గ్రూప్ (Houthi Group) రంగంలోకి దిగడం, ముడి చమురు ధరలు పెరుగుతూ ఉండడంతో సూచీలు భారీగా నష్టపోయాయి.

Contents
  • Stock Market Loss | రోజంతా నష్టాల్లోనే..
    • Stock Market Loss | అన్ని ఇండెక్స్‌లూ నష్టాల్లోనే..
    • Stock Market Loss | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

Stock Market Loss | రోజంతా నష్టాల్లోనే..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)  బేర్స్ దెబ్బకు విలవిల్లాడుతూ తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. సోమవారం రోజంతా నష్టాల్లోనే ఉంది. ఉదయం సెన్సెక్స్ 1,018 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 174 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి 774 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 270 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 79 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి 244 పాయింట్లు పైకి ఎగబాకింది. అయితే గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో సూచీలు మళ్లీ భారీగా పతనమయ్యాయి. ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్ 1,391 పాయింట్లు, నిఫ్టీ 431 పాయింట్లు పడిపోయాయి. చివరికి సెన్సెక్స్ 1,635 పాయింట్ల నష్టంతో 71,947 వద్ద, నిఫ్టీ 488 పాయింట్ల నష్టంతో 22,331 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Loss | అన్ని ఇండెక్స్‌లూ నష్టాల్లోనే..

అన్ని రంగాల ఇండెక్స్‌లు నష్టాల బాటలో పయనించాయి. బ్యాంక్ నిఫ్టీ 3.82 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.46 శాతం, టెలికాం 3.09 శాతం, రియాలిటీ 2.84 శాతం, మీడియా 2.50 శాతం, ఆటో 2.39 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.22 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 2.03 శాతం నష్టపోయాయి.

Stock Market Loss | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 876 కంపెనీలు లాభపడగా 3,563 స్టాక్స్ నష్టపోయాయి. 154 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 64 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 1,546 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎసఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 9.19 లక్షల కోట్ల మేర తగ్గింది.

Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 2 కంపెనీలు లాభాలతో, 28 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టెక్ మహీంద్రా 1.65 శాతం, పవర్‌గ్రిడ్ 0.15 శాతం లాభపడ్డాయి.

Top Losers : బజాజ్ ఫైనాన్స్ 5.09 శాతం, ఎస్‌బీఐ 3.95 శాతం, ఇండిగో 3.80 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 3.71 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.59 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Tata EV Discount | టాటా ఆఫర్​.. ఈవీ కార్లపై 20 శాతం రాయితీ

March 26 Gold Rates | ఊరించి ఉసూరుమనించిన గోల్డ్​.. మళ్లీ భగభగమంటున్న ధర!
Indian Stock Market Crash | స్టాక్ మార్కెట్‌లో బ్లడ్ బాత్.. ఊచకోతకు గురైన ప్రధాన సూచీలు
Stock Market Volatility | ప్రారంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
Samsung Galaxy M17e | శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయంటే?
March 14 Gold Rates | మహిళలకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
TAGGED:Domestic Stock Marketfinancial marketsglobal tensions impactHouthi Groupinvestor wealth lossmarket losses IndiaNifty declinesensex fallStock Market Lossstock news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Iran War Protest | Iran War Protest | ఇరాన్​పై యుద్ధానికి వ్యతిరేకంగా నగరంలో ర్యాలీ..
Next Article DCC Executive Meeting DCC Executive Meeting | డీసీసీ కార్పొరేషన్​ కార్యవర్గ సభ్యులు బాధ్యతతో వ్యవహరించాలి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?