అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Losses | హార్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని తెరవకపోతే అత్యంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామని, నరకం చూపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను బెదిరించడంతో స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఒత్తిడికి గురవుతున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనా ఎక్కువ సేపు నిలదొక్కుకోలేక నష్టాల్లోకి జారుకున్నాయి.
సోమవారం ఉదయం సెన్సెక్స్ 158 పాయింట్లు, నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 72,728 నుంచి 73,588 పాయింట్లు, నిఫ్టీ 22,542 నుంచి 22,798 పాయింట్ల మధ్యలో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 339 పాయింట్ల నష్టంతో 72,980 వద్ద, నిఫ్టీ 96 పాయింట్ల నష్టంతో 22,616 వద్ద ఉన్నాయి.
Stock Market Losses | భారీ నష్టాల్లో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)లోని ఇండెక్స్‌లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, ఫార్మా రంగాలు భారీ నష్టాలతో సాగుతున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 2.17 శాతం, ఎనర్జీ 1.79 శాతం, ఫార్మా 1.17 శాతం, మీడియా 0.59 శాతం, ఎఫ్ ఎంసీజీ 0.55 శాతం నష్టాలతో ఉన్నాయి. కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.49 శాతం, ఐటీ 0.39 శాతం లాభాలతో సాగుతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 13 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 17 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్ 5.90 శాతం, టైటాన్ 2.28 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.38 శాతం, టెక్ మహీంద్రా 0.83 శాతం, ఇన్ఫోసిస్ 0.77 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : రిలయన్స్ 3.73 శాతం, కొటక్ బ్యాంక్ 1.69 శాతం, అదానిపోర్ట్స్ 1.61 శాతం, సన్‌ఫార్మా 1.61 శాతం, మారుతి 1.46 శాతం నష్టంతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: April 06 Gold Rates | కొనుగోలుదారులకు ఊరట.. దేశవ్యాప్తంగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
