అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Losses | అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తత మరింత పెరగడంతో స్టాక్ మార్కెట్లు (Stock Markets) మళ్లీ నష్టాల బాట పట్టాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 357 పాయింట్లు, నిఫ్టీ 109 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 79,394 నుంచి 79,753 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 24,575 నుంచి 24,700 పాయింట్ల మధ్యలో ట్రేడ్ అవుతున్నాయి.
Stock Market Losses | తీవ్ర ఒడిదుడుకులతో
సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 541 పాయింట్ల నష్టంతో 79,474 వద్ద, నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో 24,597 వద్ద కదలాడుతున్నాయి. రష్యన్ చమురును కొనుగోలు చేసే విషయంలో సుంకాలనుంచి భారత్‌కు 30 రోజుల మినహాయింపును ఇవ్వడంతో రిలయన్స్ (Reliance) భారీ లాభాలతో సాగుతోంది. అయితే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలకు చెందిన షేర్లు ప్రధాన సూచీలను వెనక్కి లాగుతున్నాయి.
Stock Market Losses | మిక్స్‌డ్‌గా సూచీలు..
ప్రధాన సూచీలు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. నిఫ్టీ (Nifty) క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.50 శాతం, పవర్ 0.98 శాతం, యుటిలిటీ 0.73 శాతం, ఐటీ 0.65 శాతం లాభంతో కదలాడుతున్నాయి. రియాలిటీ ఇండెక్స్ 1.71 శాతం, ఫైనాన్షియల్ ఇండెక్స్ 1.32 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.21 శాతం, ఆటో 0.64 శాతం నష్టంతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 11 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 19 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. బీఈఎల్ 2.22 శాతం, రిలయన్స్ 1.81 శాతం, ఎన్టీపీసీ 1.55 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.98 శాతం, ఇన్ఫోసిస్ 0.62 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఐసీఐసీఐ బ్యాంక్ 2.47 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.15 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.08 శాతం, ఇండిగో 1.97 శాతం, ఎల్‌టీ 1.91 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.
ఇది కూడా చదవండి..: Mar 06 Pre Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

