అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Losses | అమెరికా, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంతో గ్లోబల్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఇరాన్ మైన్ లేయింగ్ నౌకలపై అమెరికా తీవ్ర దాడులు చేసింది. దీంతో ఇరాన్ ప్రతిగా రవాణా షిప్‌లను ధ్వంసం చేయడం, ఒమన్ పోర్టులో చమురు ట్యాంకర్లపైనా దాడి చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు మళ్లీ బ్యారెల్‌కు వంద డాలర్లకు చేరువవడం, రూపాయి విలువలో పతనం కొనసాగుతుండడంతో ఇన్ఫ్లెషన్ భయాలు పెరిగి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు (Stock Markets) నష్టాల బాటలో పయనిస్తున్నాయి. భారత జెండాతో కూడిన చమురు ట్యాంకర్లు హర్ముజ్ జలసంధి మీదుగా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించిందని వార్తలతో మార్కెట్లు కాస్త తేరుకున్నాయి.
Stock Market Losses | భారీ నష్టాలతో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) గురువారం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 494 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 498 పాయింట్లు క్షీణించింది. అక్కడినుంచి కాస్త కోలుకుని 705 పెరిగింది. నిఫ్టీ 192 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 118 పాయింట్లు నష్టపోయింది. అక్కడినుంచి కోలుకుని 218 పాయింట్లు పెరిగింది. మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 581 పాయింట్ల నష్టంతో 76,282 వద్ద, నిఫ్టీ 181 పాయింట్ల నష్టంతో 23,685 వద్ద కదలాడుతున్నాయి.
Stock Market Losses | మిశ్రమంగా సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్‌లోని సూచీలు మిక్స్‌డ్‌గా స్పందిస్తున్నాయి. నిఫ్టీలో యుటిలిటీ ఇండెక్స్ 2.15 శాతం, పవర్ 1.49 శాతం, ఎనర్జీ 1.32 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.87 శాతం లాభాలతో ఉన్నాయి. ఆటో ఇండెక్స్ 2.68 శాతం, ఎఫ్ ఎంసీజీ 1.51 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.11 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.06 శాతం, రియాలిటీ 1.05 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 6 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 24 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎన్టీపీసీ 1.43 శాతం, పవర్‌గ్రిడ్ 1.41 శాతం, రిలయన్స్ 0.88 శాతం, టెక్ మహీంద్రా 0.57 శాతం, ఆసియన్ పెయింట్ 0.53 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎంఅండ్ఎం 3.23 శాతం, మారుతి 2.75 శాతం, ట్రెంట్ 2.63 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.33 శాతం, ఇండిగో 2.33 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: March 12 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

