Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Rally | కోలుకున్న మార్కెట్లు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Rally | కోలుకున్న మార్కెట్లు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

బిజినెస్​తాజా వార్తలు

Stock Market Rally | కోలుకున్న మార్కెట్లు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయన్న ఆశలతో మార్కెట్లు పుంజుకున్నాయి. బుధవారం భారీ లాభాలతో ముగిశాయి.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 1, 2026 4:48 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Stock Market Rally

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Rally | అమెరికా, ఇరాన్‌ల మధ్య ఐదు వారాలుగా కొనసాగుతున్న యుద్ధంతో కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు (Stock Markets).. బుధవారం ఊపిరి పీల్చుకున్నాయి. బేర్స్‌పై బుల్స్ ఆధిపత్యం సాధించడంతో సూచీలు భారీగా పెరిగాయి.

Contents
  • Stock Market Rally | భారీ లాభాలతో ప్రారంభమై..
    • Stock Market Rally | ఫార్మా మినహా..
      • Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్‌గా ఉండడం, తమకు అమెరికా పంపిస్తున్న సందేశాలు చేరుతున్నాయని ఇరాన్ పేర్కొనడం, క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర దిగిరావడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లలో ఆశావాదం పెరిగింది. దీంతో కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్లకు మద్దతుగా నిలవడంతో మార్కెట్లు పరుగులు తీశాయి.

Stock Market Rally | భారీ లాభాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం భారీ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 1,815 పాయింట్లు, నిఫ్టీ 568 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 72,971 నుంచి 73,964 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 22,618 నుంచి 22,941 పాయింట్ల మధ్యలో ట్రేడ్ అయ్యాయి. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో ప్రారంభంలో వచ్చిన లాభాలు తగ్గిపోయాయి. చివరికి సెన్సెక్స్ 1,186 పాయింట్ల లాభంతో 73,134 వద్ద, నిఫ్టీ 348 పాయింట్ల లాభంతో 22,679 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Rally | ఫార్మా మినహా..

ఫార్మా మినహా అన్ని ఇండెక్స్ లూ లాభాలతో ముగిశాయి. మీడియా 3.69 శాతం, క్యాపిటల్ గూడ్స్ 3.29 శాతం పెరగ్గా.. మెటల్, కన్జూమర్ డ్యూరెబుల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, రియాలిటీ, ఐటీ ఇండెక్స్‌లు రెండు శాతానికిపైగా లాభపడ్డాయి. ఫార్మా ఇండెక్స్ 0.99 శాతం నష్టపోయింది.

Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 3,828 కంపెనీలు లాభపడగా 508 స్టాక్స్ నష్టపోయాయి. 101 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 62 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 220 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎసఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 10 లక్షల కోట్ల మేర పెరిగింది.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 25 కంపెనీలు లాభాలతో, 5 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ట్రెంట్ 6.74 శాతం, ఇండిగో 6.01 శాతం, అదాని పోర్ట్స్ 5.47 శాతం, బీఈఎల్ 4.54 శాతం, ఎస్‌బీఐ 3.89 శాతం లాభపడ్డాయి.

Losers : ఎన్టీపీసీ 1.64 శాతం, సన్ ఫార్మా 1.64 శాతం, పవర్‌గ్రిడ్ 1.13 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.29 శాతం, ఎయిర్‌టెల్ 0.13 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: April 01 Gold Rates | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధ‌ర‌.. చెన్నైలో మాత్రం కాస్త శాంతించిన ప‌సిడి

Orange Alert Rains | దంచికొట్టిన వాన.. ఉభయ జిల్లాలకు ఆరెంజ్​ అలెర్ట్​
Alipiri Walkers Protest | అలిపిరి మార్గంలో వాకర్ల ఆందోళన.. నగరవనం ప్రవేశ రుసుముపై రాస్తారోకో, ట్రాఫిక్ జామ్
Kidney Disease | కిడ్నీలు పాడవుతున్నాయని చెప్పే ‘రెడ్ సిగ్నల్స్’ ఇవే.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే డేంజరే!
Ramagundam NTPC Phase 2 | రామగుండం ఎన్టీపీసీ రెండో దశను వేగవంతం చేయాలి: కిషన్​ రెడ్డి
Clay Water Pot | వేసవిలో కొత్త కుండ కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
TAGGED:Crude Oilequity market updateinvestor sentiment indiamarket gains newsnifty closingSensex Todayshare market indiastock market indiastock market rally
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Big TV Resignations Big TV Resignations | బిగ్​ టీవీలో రాజీనామాల కలకలం..!
Next Article Caste Discrimination Case Caste Discrimination Case | కులవివక్ష చూపిన వారిని అరెస్ట్​ చేయాల్సిందే..: ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?