అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Rally | అమెరికా సంతృప్తికర ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో వస్తే అణు కార్యక్రమంపై పునరాలోచనకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ డిప్యూటీ ఎక్స్‌టర్నల్ మినిస్టర్ ప్రకటన చేశారన్న వార్తలతో ఇన్వెస్టర్లలో భయాలు తగ్గాయి.
దీంతోపాటు ఆర్‌బీఐ (RBI) తీసుకున్న చర్యలతో రూపాయి విలువ బలపడడం, క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర దిగిరావడం తదితర కారణాలతో స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. మెటల్ సెక్టార్ విశేషంగా రాణించింది. రిలయన్స్, హెచ్‌డీఎఫ్సీ వంటి స్టాక్స్ ప్రధాన సూచీలను ముందుకు తీసుకువెళ్లాయి.
Stock Market Rally | రోజంతా ఒడిదుడుకులు..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గురువారం భారీ గ్యాప్ అప్‌లో ప్రారంభమైనా తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగింది. గురువారం ఉదయం సెన్సెక్స్ 414 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 150 పాయింట్లు ఎగబాకింది. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో 463 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 57 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 142 పాయింట్లు పడిపోయింది. మధ్యాహ్నం 2.15 గంటల తర్వాత మార్కెట్లు కోలుకుని భారీ లాభాల దిశగా సాగాయి. చివరికి సెన్సెక్స్ 899 పాయింట్ల లాభంతో 80,015 వద్ద, నిఫ్టీ 285 పాయింట్ల లాభంతో 24,765 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Rally | ఐటీ మినహా..
ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.59 శాతం నష్టపోయింది. యుటిలిటీ 2.58 శాతం, పవర్ 2.41 శాతం, మెటల్ ఇండెక్స్ 2.29 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.29 శాతం, ఆటో 1.86 శాతం, ఎనర్జీ 1.83 శాతం, రియాలిటీ 1.83 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్ 1.60 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.56 శాతం పెరగ్గా.. ఫార్మా, టెలికాం, మీడియా ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా లాభంతో ముగిశాయి.
Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,803 కంపెనీలు లాభపడగా 1,453 స్టాక్స్ నష్టపోయాయి. 141 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 66 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 381 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 14 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 11 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్ ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 6 లక్షల కోట్లమేర పెరిగింది.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 20 కంపెనీలు లాభాలతో, 10 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. అదానీ పోర్ట్స్ 4.51 శాతం, ఎల్‌టీ 3.88 శాతం, ఎన్టీపీసీ 3.36 శాతం, రిలయన్స్ 3.29 శాతం, బీఈఎల్ 2.98 శాతం లాభపడ్డాయి.
Top Losers : టెక్ మహీంద్రా 1.30 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.56 శాతం, హెచ్‌యూఎల్ 0.38 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.37 శాతం, ఎస్‌బీఐ 0.27 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Gold Rates Today | మరికాస్త ఊరట.. హైదరాబాద్‌లో స్వల్పంగా బంగారం, వెండి ధరలు తగ్గుదల

