అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Rally | యుద్ధం విరమించే విషయంలో ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నందున ఆ దేశ ఇంధన మౌలిక సదుపాయాలపై ప్రణాళికబద్ధమైన దాడులను వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) చెప్పడంతో స్టాక్ మార్కెట్లు కాస్త ఊరట చెందాయి.
ఏప్రిల్ 9వ తేదీలోగా ఇరాన్ (Iran)తో యుద్ధాన్ని ముగించే అవకాశాలు ఉన్నాయని ఇజ్రాయిల్ మీడియా నివేదించింది. దీంతో మంగళవారం ఉదయం స్టాక్ మార్కెట్ (Stock Market)లో భారీ గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యాయి. అయితే అమెరికాతో చర్చలలో తాము పాల్గొనడం లేదన్న ఇరాన్ ప్రకటనతో ఇన్వెస్టర్లు అప్రమత్తమై ప్రాఫిట్ బుకింగ్ కు దిగడంతో ప్రారంభ లాభాలు తగ్గిపోయాయి.
Stock Market Rally | భారీ గ్యాప్ అప్ లో ప్రారంభమై..
మంగళవారం ఉదయం సెన్సెక్స్ 1,516 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. అయితే ప్రారంభ లాభాలను నిలబెట్టుకోలేకపోయింది. అమ్మకాల ఒత్తిడితో ఇంట్రాడే గరిష్టాలనుంచి 1,128 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 366 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 21 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 275 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 811 పాయింట్ల లాభంతో 73,507 వద్ద, నిఫ్టీ 250 పాయింట్ల లాభంతో 22,763 వద్ద కదలాడుతున్నాయి.
Stock Market Rally | అన్ని రంగాలూ లాభాల్లోనే..
అన్ని రంగాల ఇండెక్స్‌లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఐటీ ఇండెక్స్ ప్రధాన సూచీలను ముందుకు నడిపిస్తోంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2.03 శాతం పెరగ్గా.. మీడియా 1.23 శాతం, బ్యాంకెక్స్ 1.18 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.17 శాతం, ఆటో 1.12 శాతం లాభాలతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 28 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 2 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇండిగో 3.52 శాతం, ఎటర్నల్ 3.04 శాతం, టెక్ మహీంద్రా 2.86 శాతం, ఆసియన్ పెయింట్ 2.74 శాతం, కొటక్ బ్యాంక్ 2.50 శాతం లాభాలతో ఉన్నాయి.
Losers : పవర్‌గ్రిడ్ 1.38 శాతం, ఎన్‌బీఐ 0.09 శాతం నష్టంతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: March 24 Gold Rates | పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం, వెండి ధరల్లో భారీ పతనం!

