Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Rally | బుల్ జోరు.. రాణించిన సూచీలు.. రూ. 6 లక్షల కోట్లు పెరిగిన సంపద
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Rally | బుల్ జోరు.. రాణించిన సూచీలు.. రూ. 6 లక్షల కోట్లు పెరిగిన సంపద

బిజినెస్​

Stock Market Rally | బుల్ జోరు.. రాణించిన సూచీలు.. రూ. 6 లక్షల కోట్లు పెరిగిన సంపద

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాల బాటలో సాగింది. సెన్సెక్స్ 633 పాయింట్లు, నిఫ్టీ 196 పాయింట్లు పెరిగాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 18, 2026 4:30 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Stock Market Rally

అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Stock Market Rally | అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం ఎడతెగకుండా కొనసాగుతున్నా.. క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు కాస్త శాంతించాయి. హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా టర్కీ మీదుగా చమురు ఎగుమతులను పున:ప్రారంభించేందుకు గల్ఫ్ దేశాలు చర్యలు తీసుకుంటున్నాయన్న సమాచారంతో గ్లోబల్ మార్కెట్లు ఉపశమనం పొందాయి.

Contents
  • Stock Market Rally | రోజంతా లాభాల్లోనే..
    • Stock Market Rally | ఎఫ్ఎంసీజీ, మెటల్ సెక్టార్లు మినహా..
      • Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

దీని ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సైతం లాభాల బాటలో పయనించాయి. దలాల్ స్ట్రీట్‌లో బుల్స్ జోష్ కొనసాగించినా.. కిందపడేసేందుకు బేర్స్ సైతం తీవ్రంగా ప్రయత్నించడంతో సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.

Stock Market Rally | రోజంతా లాభాల్లోనే..

దేశీయ స్టాక్ మార్కెట్ రోజంతా లాభాల బాటలోనే పయనించింది. బుధవారం ఉదయం సెన్సెక్స్ 297 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి మరో 242 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో ఒత్తిడికి గురై అక్కడినుంచి 422 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి 122 పాయిట్లు పైకి ఎగబాకింది. గరిష్టాలనుంచి 136 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లకు మద్దతుగా నిలవడంతో సూచీలు భారీగా పెరిగాయి. చివరి గంటలో ప్రాఫిట్ బుకింగ్‌తో కొంత తగ్గాయి. చివరికి సెన్సెక్స్ 633 పాయింట్ల లాభంతో 76,704 వద్ద, నిఫ్టీ 196 పాయింట్ల లాభంతో 23,777 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Rally | ఎఫ్ఎంసీజీ, మెటల్ సెక్టార్లు మినహా..

మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించాయి. చాలా రోజుల తర్వాత ఐటీ ఇండెక్స్ ఈరోజు జోరుమీద కనిపించింది. నిఫ్టీ (Nifty)  ఐటీ ఇండెక్స్ 2.78 శాతం లాభపడగా.. మీడియా ఇండెక్స్ 3.35 శాతం, రియాలిటీ 2.75 శాతం, టెలికాం 2.44 శాతం, ఆటో 1.92 శాతం, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా లాభాలతో ముగిశాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.10 శాతం, ఎఫ్ఎంసీజీ 0.05 శాతం నష్టపోయాయి.

Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 3,202 కంపెనీలు లాభపడగా 1,088 స్టాక్స్ నష్టపోయాయి. 142 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 56 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 220 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 12 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 13 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎసఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 6 లక్షల కోట్ల మేర పెరిగింది.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 24 కంపెనీలు లాభాలతో, 6 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్ 3.37 శాతం, టెక్ మహీంద్రా 3.27 శాతం, ఇన్ఫోసిస్ 2.84 శాతం, ఎంఅండ్ ఎం 2.68 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.62 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఎన్టీపీసీ 1.29 శాతం, హెచ్‌యూఎల్ 1.04 శాతం, సన్‌ఫార్మా 0.87 శాతం, హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ 0.34 శాతం, ఐటీసీ 0.30 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Gold Rates India | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

Stock Market Crash | స్టాక్ మార్కెట్‌లో మరో బ్లాక్ మండే… రూ. 13.6 లక్షల కోట్ల సంపద ఆవిరి
Gold Rates India | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!
Stock Market Crash | మళ్లీ కుప్పకూలిన మార్కెట్లు.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
Fortune Atta | ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ పిండి ఉత్పత్తుల శ్రేణి విస్తరణ.. ‘ఫార్చ్యూన్ మల్టీగ్రైన్ అట్టా’ విడుదల
Stock Market Losses | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
TAGGED:Crude OilDomestic Stock MarketNiftystock market rally
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Fake Paneer Seizure Fake Paneer Seizure | మార్కెట్​లో కల్తీ పన్నీరు​ విక్రయం.. తిన్నారంటే అంతే!
Next Article BJP Promises Criticism BJP Promises Criticism | బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: డీసీసీ అధ్యక్షుడు నగేశ్​ రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?