అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Rally | అమెరికా, ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ దిశగా అడుగులు పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా అందిస్తున్న రిపోర్ట్‌లు ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ (Crude oil) ధర దిగివస్తుండడం, డాలర్, బాండ్ ఈల్డ్స్ తగ్గడం వంటి కారణాలతో ఈక్విటీ మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి.
Stock Market Rally | రోజంతా లాభాల్లోనే..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) బుధవారం రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఉదయం సెన్సెక్స్ 584 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా మొదట్లో 102 పాయింట్లు తగ్గింది. తర్వాత పుంజుకుని 1,299 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ (Nifty) 152 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి మరో 402 పాయింట్లు పెరిగింది. చివరి గంటన్నరలో ప్రాఫిట్ బుకింగ్‌తో లాభాలు కాస్త తగ్గాయి. చివరికి సెన్సెక్స్ (Sensex) 1,205 పాయింట్ల లాభంతో 75,273 వద్ద, నిఫ్టీ 394 పాయింట్ల లాభంతో 23,306 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Rally | అన్ని ఇండెక్స్‌లు గ్రీన్‌లోనే..
అన్ని రంగాల ఇండెక్స్‌లు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ కన్జూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్ 3.28 శాతం లాభంతో ఉండగా.. మెటల్, క్యాపిటల్ గూడ్స్, రియాలిటీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇండెక్స్‌లు 2 శాతానికిపైగా పెరిగాయి.
Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,959 కంపెనీలు లాభపడగా 1,357 స్టాక్స్ నష్టపోయాయి. 156 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 67 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 245 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎసఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 8.7 లక్షల కోట్ల మేర పెరిగింది.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 26 కంపెనీలు లాభాలతో, 4 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. అల్ట్రాటెక్ సిమెంట్ 4.39 శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.82 శాతం, ఎల్‌టీ 3.80 శాతం, టైటాన్ 3.50 శాతం, ఇండిగో 3.46 శాతం లాభపడ్డాయి.
Losers : టెక్ మహీంద్రా 1.66 శాతం, పవర్‌గ్రిడ్ 1.37 శాతం, టీసీఎస్ 0.86 శాతం, బీఈఎల్ 0.27 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: march 25 Gold Rates | గోల్డ్ ప్రియుల్లో ఆనందం.. పెట్టుబడిదారుల్లో ఆందోళన

