అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Rebound | క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు భారీగా పెరగడంతో గత సెషన్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్లు మంగళవారం కోలుకున్నాయి.
ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరుకుంటోందన్న యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ (US President Trump).. ఇంధన ధరలను నియంత్రించేందుకు చమురుపై ఆంక్షలను సడలించనున్నట్లు ప్రకటించడంతో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. దీనికితోడు రూపాయి విలువ బలపడడంతో ఇన్వెస్టర్లు కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మద్దతుగా నిలిచారు. దీంతో సూచీలు పరుగులు తీశాయి.
Stock Market Rebound | గ్యాప్ అప్ లో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 809 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో 630 పాయింట్లు కోల్పోయింది. తర్వాత కోలుకుని 781 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 252 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి 201 పాయింట్లు పడిపోయింది. తిరిగి కోలుకుని 224 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 639 పాయింట్ల లాభంతో 78,205 వద్ద, నిఫ్టీ 233 పాయింట్ల లాభంతో 24,261 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Rebound | ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లలో నష్టాలు..
ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ సెక్టార్లు మినహా మిగిలిన ఇండెక్స్‌లు లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 3.10 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 2.60 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.01 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.66 శాతం, పవర్, రియాలిటీ ఇండెక్స్‌లు 1.56 శాతం, మెటల్ 1.54 శాతం, మీడియా 1.51 శాతం, ఫార్మా 1.39 శాతం లాభాలతో ముగిశాయి. క్యాపిటల్ గూడ్స్, యుటిలిటీ ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా పెరిగాయి. ఐటీ ఇండెక్స్ 0.46 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.39 శాతం, ఎనర్జీ 0.16 శాతం నష్టపోయాయి.

Stock Market Rebound | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 3,103 కంపెనీలు లాభపడగా 1,175 స్టాక్స్ నష్టపోయాయి. 142 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 65 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 237 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 10 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 12 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్ ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 6.8 లక్షల కోట్ల మేర పెరిగింది.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 24 కంపెనీలు లాభాలతో, 6 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎంఅండ్ఎం 3.67 శాతం, ఇండిగో 3.21 శాతం, మారుతి 2.94 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.73 శాతం, ఆసియన్ పెయింట్ 2.70 శాతం లాభపడ్డాయి.
Top Losers : ఎటర్నల్ 1.50 శాతం, ఇన్ఫోసిస్ 1.43 శాతం, రిలయన్స్ 1.08 శాతం, ఎయిర్‌టెల్ 0.86 శాతం, టీసీఎస్ 0.57 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Dalal Street Black Monday | దేశీయ మార్కెట్లలో బ్లడ్‌బాత్.. కల్లోలం సృష్టించిన క్రూడ్ ఆయిల్ ధర..

