Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Recovery | పడిలేచిన మార్కెట్లు.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Recovery | పడిలేచిన మార్కెట్లు.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

బిజినెస్​

Stock Market Recovery | పడిలేచిన మార్కెట్లు.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ పడిలేచింది. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమై చివరికి స్వల్ప లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 185 పాయింట్లు, నిఫ్టీ 33 పాయింట్లు లాభపడ్డాయి.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 2, 2026 4:24 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Stock Market Recovery

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Recovery | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గురువారం భారీ ఒడిదుడుకుల మధ్య సాగింది. ఉదయం భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభమైన ప్రధాన సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకుని చివరికి లాభాలతో ముగిశాయి.

Contents
  • Stock Market Recovery | భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభమై..
    • Stock Market Recovery | బలపడిన రూపాయి..
      • Stock Market Recovery | ఆదుకున్న ఐటీ..
        • Stock Market Recovery | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

రూపాయి విలువ బలపడడం, కనిష్టాల వద్ద కంపెనీల వాల్యూయేషన్స్ సరైనవిగా కనిపించంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మద్దతు ఇచ్చారు. దీంతో మార్కెట్లు కోలుకున్నాయి. రెండు వరుస సెషన్లు లాభాలతో ముగిసినా.. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా ఆరో వారాన్ని నష్టాలతోనే ముగించాయి.

Stock Market Recovery | భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 872 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 717 పాయింట్లు కోల్పోయింది. మధ్యాహ్నం తర్వాత కోలుకుని 2,023 పాయింట్లు పైకి ఎగబాకింది. నిఫ్టీ 296 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 11 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి మరో 212 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో 600 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 185 పాయింట్ల లాభంతో 73,319 వద్ద, నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 22,713 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Recovery | బలపడిన రూపాయి..

డాలర్ తో పోల్చితే కొంతకాలంగా బలహీనపడుతూ వస్తున్న రూపాయి విలువ గురువారం భారీగా పెరిగింది. ఇంట్రాడేలో 92.82 వరకు పెరిగినా.. ఆ తర్వాత లాభాల స్వీకరణతో కాస్త తగ్గి 93.10 వద్ద నిలిచింది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ తీసుకొచ్చిన మార్గదర్శకాలతో బలపడుతోందని భావిస్తున్నారు.

Stock Market Recovery | ఆదుకున్న ఐటీ..

ఐటీ ఇండెక్స్ 2.60 శాతం, రియాలిటీ ఇండెక్స్ 1.07 శాతం, టెలికాం 0.36 శాతం, పెరిగాయి. ఫార్మా 0.92 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.87 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.79 శాతం, ఆటో 0.62 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 0.68 శాతం నష్టపోయాయి.

Stock Market Recovery | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,680 కంపెనీలు లాభపడగా 1,547 స్టాక్స్ నష్టపోయాయి. 160 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 57 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 157 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 19 కంపెనీలు లాభాలతో, 11 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. హెచ్‌సీఎల్ టెక్ 3.47 శాతం, టెక్ మహీంద్రా 2.67 శాతం, ఇన్ఫోసిస్ 1.90 శాతం, టీసీఎస్ 1.80 శాతం, హెచ్‌డీఎఫ్ సీ బ్యాంక్ 1.21 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఆసియన్ పెయింట్ 2.46 శాతం, ఎటర్నల్ 2.13 శాతం, సన్‌ఫర్మా 1.70 శాతం, ఎన్టీపీసీ 1.33 శాతం, రిలయన్స్ 1.31 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Ola Electric Sales Growth | ఓలా.. అమ్మకాలు భళా!

Stock Market Rally | తగ్గుతున్న యుద్ధ భయాలు.. పరుగులు తీస్తున్న స్టాక్ మార్కెట్లు
Crude Oil Price Fall | భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధర.. లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు
Stock Market Fall | స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. రూ. 9 లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు
March 16 Pre Market Analysis | లాభాల్లో గిఫ్ట్ నిఫ్టీ.. గ్యాప్ అప్​లో ప్రారంభం కానున్న నిఫ్టీ, సెన్సెక్స్
Stock Market Surge | తగ్గుతున్న ఉద్రిక్తతలు.. భారీగా పెరిగిన సూచీలు
TAGGED:Domestic Stock Marketindian stocksIT sector rallyMarket RecoveryNifty gainsrupee strengthSensex TodayStock Market Recoverytrading news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Praja Palana Development | Praja Palana Development | ప్రజాపాలనలో వేగంగా అభివృద్ధి: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
Next Article Toddy Depot Permission Toddy Depot Permission | రెండో కల్లు డిపోను కొనసాగించేలా అనుమతి ఇవ్వండి..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?