Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Relief Rally | స్టాక్ మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. లాభాల బాటలో ప్రధాన సూచీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Relief Rally | స్టాక్ మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. లాభాల బాటలో ప్రధాన సూచీలు

బిజినెస్​తాజా వార్తలు

Stock Market Relief Rally | స్టాక్ మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. లాభాల బాటలో ప్రధాన సూచీలు

స్టాక్ మార్కెట్లు మూడు రోజుల నష్టాల తర్వాత ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 483 పాయింట్లు, నిఫ్టీ 160 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 5, 2026 11:37 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Stock Market Relief Rally
Stock Market Relief Rally

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Relief Rally | అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో భారీ నష్టాల బాటలో పయనిస్తున్న స్టాక్ మార్కెట్లు (Stock Markets).. గురువారం కోలుకున్నాయి. అయితే యుద్ధ భయాలు వీడకపోవడంతో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.

గురువారం ఉదయం సెన్సెక్స్ 414 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 150 పాయింట్లు ఎగబాకింది. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో 463 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 57 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 142 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 483 పాయింట్ల లాభంతో 79,599 వద్ద, నిఫ్టీ 160 పాయింట్ల లాభంతో 24,641 వద్ద కదలాడుతున్నాయి.

Stock Market Relief Rally | మెటల్ షేర్లలో కొనసాగుతున్న ర్యాలీ..

నిఫ్టీ (Nifty) మెటల్ ఇండెక్స్ 3.18 శాతం, ఎనర్జీ 2.10 శాతం, యుటిలిటీ 1.92 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.81 శాతం, పవర్ 1.71 శాతం పెరగ్గా.. క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, రియాలిటీ ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా లాభంతో కొనసాగుతున్నాయి. ఐటీ ఇండెక్స్ 1.34 శాతం, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్‌ 0.46 శాతం నష్టాలతో ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 18 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 12 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. బీఈఎల్ 2.99 శాతం, ఎన్టీపీసీ 2.80 శాతం, రిలయన్స్ 2.76 శాతం, టాటా స్టీల్ 2.67 శాతం, ఎల్‌టీ 2.18 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఎటర్నల్ 2.41 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.02 శాతం, టెక్ మహీంద్రా 1.56 శాతం, టీసీఎస్ 1.33 శాతం, ఆసియన్ పెయింట్ 1.20 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Fall | స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. రూ. 9 లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు

Half Day Schools | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. 15 నుంచి ఒంటిపూట బడులు
Telangana School Hostel | హాస్టళ్లను తనిఖీ చేసిన ఎంఈవో.. కేర్​టేకర్​ను తొలగించాలని ఆదేశం..
Stock Market Gains | ఐటీ, ఆటో సెక్టార్లలో జోరు.. భారీ లాభాల దిశగా సూచీలు
ISRO YUVIKA 2026 | విద్యార్థులకు సూపర్​ ఛాన్స్​.. ఇస్రో ‘యువిక 2026’ రిజిస్ట్రేషన్లు షురూ..
March 22 Gold Rates | బంగారం, వెండి ధరల్లో భారీ పతనం.. దేశ వ్యాప్తంగా నేటి పరిస్థితి ఏమిటంటే!
TAGGED:energy stocks indiaIndian Stock Marketmetal stocks rallyNifty TodaySensex Todayshare market updatestock market newsstock market rally
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Gym Heart Attack Death Gym Heart Attack Death | జిమ్​ చేస్తూ హార్ట్​ ఎటాక్​తో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి మృతి
Next Article Trump Tariff Refund Trump Tariff Refund | ట్రంప్​కు షాక్​.. టారిఫ్​ డబ్బులు రిటన్​ ఇచ్చేయాలన్న కోర్టు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?