అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Surge | యుద్ధం విరమించే విషయంలో ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నందున ఆ దేశ ఇంధన మౌలిక సదుపాయాలపై ప్రణాళికబద్ధమైన దాడులను వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్‌లకు కాస్త ఊరటనిచ్చింది.
అమెరికాతో చర్చలు జరిపి ఒక ఒప్పందానికి రావడానికి ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) అంగీకరించారన్న అల్ అరేబియా రిపోర్ట్ దీనికి తోడయ్యింది. రూపాయి విలువ కాస్త బలపడడం, క్రూడ్ ఆయిల్ ధర దిగిరావడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మద్దతుగా నిలిచారు. అయితే దీనిని ఇరాన్ ధ్రువీకరించకపోవడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి.
Stock Market Surge | భారీ లాభాలతో ప్రారంభమై..
మంగళవారం ఉదయం సెన్సెక్స్ 1,516 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. అయితే అమ్మకాల ఒత్తిడితో ప్రారంభంలోనే 1,128 పాయింట్లు పడిపోయింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి 1,405 పాయింట్లు పైకి వచ్చింది. నిఫ్టీ 366 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 21 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 275 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద లభించిన మద్దతుతో కోలుకుని 433 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 1,372 పాయింట్ల లాభంతో 74,068 వద్ద, నిఫ్టీ 399 పాయింట్ల నష్టంతో 22,912 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Surge | అన్ని రంగాలూ లాభాల్లోనే..
అన్ని రంగాల ఇండెక్స్‌లు లాభాల బాటలో పయనించాయి. నిఫ్టీ (Nifty) మీడియా ఇండెక్స్ 3.45 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 2.46 శాతం, ఆటో 2.43 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.34 శాతం, బ్యాంక్ నిఫ్టీ 2.27 శాతం, టెలికాం 1.94 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.90 శాతం, ఐటీ ఇండెక్స్ 1.72 శాతం పెరిగాయి.
Stock Market Surge | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,968 కంపెనీలు లాభపడగా 1,295 స్టాక్స్ నష్టపోయాయి. 168 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 44 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 557 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎసఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 8.25 లక్షల కోట్ల మేర పెరిగింది.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 28 కంపెనీలు లాభాలతో, 2 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎల్‌టీ 5.19 శాతం, ఇండిగో 5.18 శాతం, ఎటర్నల్ 4.85 శాతం, బజాజ్ ఫైనాన్స్ 4.69 శాతం, ఆసియన్ పెయింట్ 4.54 శాతం లాభపడ్డాయి.
Losers : పవర్‌గ్రిడ్ 0.81 శాతం, ఎన్‌బీఐ 0.09 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: March 24 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

