Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Volatility | వీడని యుద్ధ భయాలు.. లాభనష్టాల మధ్య ఊగిసలాటలో మార్కెట్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Volatility | వీడని యుద్ధ భయాలు.. లాభనష్టాల మధ్య ఊగిసలాటలో మార్కెట్లు

బిజినెస్​తాజా వార్తలు

Stock Market Volatility | వీడని యుద్ధ భయాలు.. లాభనష్టాల మధ్య ఊగిసలాటలో మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం సైతం తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 67 పాయింట్లు, నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 17, 2026 11:57 ఉద.
Srinivas Kolluri
1 వారం ago
Share
Stock Market Volatility

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Volatility | పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంతో స్టాక్ మార్కెట్లు (Stock Markets) తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర బ్యారెల్‌కు వంద డాలర్లపైనే ఉంటుండడం, రూపాయి విలువ స్వల్పంగా క్షీణించడం, ఎఫ్ ఐఐలు భారీగా అమ్మకాలకు పాల్పడుతుండడంతో ప్రధాన సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి.

Contents
  • Stock Market Volatility | లాభంతో ప్రారంభమైనా
    • Stock Market Volatility | ఐటీలో ఆగని పతనం

Stock Market Volatility | లాభంతో ప్రారంభమైనా

కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తున్న ఇన్వెస్టర్లు.. కాస్త పెరగ్గానే ప్రాఫిట్ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ సాగుతున్నాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 324 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా అక్కడినుంచి 502 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో పుంజుకుని 690 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 85 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి 147 పాయిట్లు పడిపోయింది. తిరిగి కోలుకుని కనిష్టాల వద్దనుంచి 231 పాయింట్లు పెరిగింది. అయితే గరిష్టాల వద్ద తిరిగి ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో సూచీలు పతనమయ్యాయి. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 67 పాయింట్ల నష్టంతో 75,434 వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 23,391 వద్ద కదలాడుతున్నాయి.

Stock Market Volatility | ఐటీలో ఆగని పతనం

ఏఐ షాక్‌నుంచి ఐటీ స్టాక్స్‌లో కోలుకోవడం లేదు. నిఫ్టీ 1.34 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఎఫ్ ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, యుటిలిటీ, ఫార్మా, ఫైనాన్షియల్, బ్యాంకింగ్ ఇండెక్స్‌లు నష్టాల బాటలో ఉన్నాయి. మెటల్ ఇండెక్స్ 1.25 శాతం పెరగ్గా.. ఆటో, టెలికాం, మీడియా, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్‌లు లాభాలతో ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 13 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 17 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎటర్నల్ 3.72 శాతం, టాటా స్టీల్ 2 శాతం, ఎంఅండ్ ఎం 1.82 శాతం, ఎయిర్‌టెల్ 1.18 శాతం, బీఈఎల్ 0.98 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers :బజాజ్ ఫైనాన్స్ 1.86 శాతం, ఇన్ఫోసిస్ 1.51 శాతం, అదానిపోర్ట్స్ 1.44 శాతం, ఎస్‌బీఐ 1.39 శాతం, పవర్‌గ్రిడ్ 1.16 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: March 17 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్ ముందు మధ్యతరగతికి కాస్త ఊరట

Jadakoppulaata Festival | దూపెల్లిలో జడకొప్పులాట.. పాల్గొన్న పోలీస్ కమిషనర్
Ali Khamenei Death | ఖమేనీ మరణం.. ఇరాన్​లో 40 రోజులు సంతాప దినాలు.. వారం రోజులు సెలవులు!
Jharkhand Bus Accident | ఘాట్ రోడ్డు దిగుతుండగా ఘోరం.. బస్సు బ్రేకులు ఫెయిల్.. ఐదుగురు దుర్మరణం
Global Stock Markets | పాజిటివ్‌గా గ్లోబల్ మార్కెట్లు..
Realme Narzo Power 5G | భారీ బ్యాటరీతో రియల్‌మీ ‘పవర్’ విడుదల.. ప్రారంభ ఆఫర్‌లో రూ. 4 వేల వరకు తగ్గింపు
TAGGED:Crude OilCrude Oil Impactfii sellingIndian stock market newsmarket volatilityNifty TodaySensex TodayShare Market Updatesstock market indiaStock Market Volatility
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article BEL Engineer Jobs BEL Engineer Jobs | బీఈఎల్‌లో ఉద్యోగావకాశాలు
Next Article India Dairy Consumption India Dairy Consumption | భారతీయ గృహ పోషణలో డైరీ విప్లవం: 75.8 శాతం మంది యాక్టివ్ వినియోగదారులే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?