Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market War Fears | వీడని యుద్ధ భయాలు.. భారీ నష్టాల్లో సూచీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market War Fears | వీడని యుద్ధ భయాలు.. భారీ నష్టాల్లో సూచీలు

బిజినెస్​

Stock Market War Fears | వీడని యుద్ధ భయాలు.. భారీ నష్టాల్లో సూచీలు

యుద్ధ భయాలతో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. శుక్రవారం ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 702 పాయింట్లు, నిఫ్టీ 242 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 13, 2026 12:21 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 వారాలు ago
Share
Stock Market War Fears

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market War Fears | అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం ముదురుతుండడంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఇప్పట్లో శాంతి నెలకొనే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి.

Contents
  • Stock Market War Fears | కోలుకోని మార్కెట్లు..
    • Stock Market War Fears | ఎఫ్ఎంసీజీ మినహా..

ప్రపంచాన్ని ద్రవ్యోల్బణం భయపెడుతుండడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. క్రూడ్ ఆయిల్ (Crude Oil)  ధరలకు రెక్కలు రావడం, రూపాయి విలువ ఏమాత్రం కోలుకోకపోవడం, ఫారిన్ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్‌నుంచి భారీగా పెట్టుబడులను ఉపసంహరిస్తుండడంతో స్టాక్ మార్కెట్ తీవ్రంగా నష్టపోతోంది.

Stock Market War Fears | కోలుకోని మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) శుక్రవారం సైతం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 590 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మొదట్లో 132 పాయింట్లు పెరిగింది. తిరిగి అమ్మకాల ఒత్తిడితో 506 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 177 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 30 పాయింట్లు పెరిగినా నిలదొక్కుకోలేకపోయింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 187 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 702 పాయింట్ల నష్టంతో 75,331 వద్ద, నిఫ్టీ 242 పాయింట్ల నష్టంతో 23,396 వద్ద కదలాడుతున్నాయి.

Stock Market War Fears | ఎఫ్ఎంసీజీ మినహా..

దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఎఫ్ఎంసీజీ సెక్టార్ మినహా మిగిలిన సూచీలు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ 0.75 శాతం లాభాలతో ఉంది. మెటల్ ఇండెక్స్ 3.63 శాతం, ఆటో ఇండెక్స్ 2.22 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.20 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.62 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.36 శాతం, టెలికాం 1.31 శాతం, ఫార్మా 1.37 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.27 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 8 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 22 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్‌యూఎల్ 2.32 శాతం, ట్రెంట్ 1.03 శాతం, ఎయిర్‌టెల్ 0.73 శాతం, పవర్‌గ్రిడ్ 0.44 శాతం, ఎన్టీపీసీ 0.44 శాతం లాభాలతో ఉన్నాయి.

Top losers : ఎల్‌టీ 4.23 శాతం, టాటా స్టీల్ 3.83 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 3.13 శాతం, బీఈఎల్ 2.72 శాతం, కొటక్ బ్యాంక్ 2.13 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: March 13 Gold Prices | బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ప్రధాన నగరాల్లో తాజా పరిస్థితి ఇదే!

HDFC Bank Share Crash | కుప్పకూలిన హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు..నాయకత్వ మార్పే కారణమా?
Tata Motors March Offers | ‘టాటా మోటార్స్ మార్చి ఆఫర్స్.. డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా..
Strait of Hormuz Closure | హార్ముజ్‌ జలసంధి వద్ద చిక్కుకుపోయిన 700కి పైగా నౌకలు
March 13 Gold Prices | బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ప్రధాన నగరాల్లో తాజా పరిస్థితి ఇదే!
Stock Market Crash | కుదేలైన స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు
TAGGED:crude oil pricesfii outflows indiaglobal market impactIndian stock market fallNifty TodaySensex Todaystock market newsUS Iran tensions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Israel Iran Warning Israel Iran Warning | ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌కు ఇజ్రాయల్‌ వార్నింగ్..
Next Article Domestic Cylinders Seized Domestic Cylinders Seized | హోటల్​లో డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసిన అధికారులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?