అక్షరటుడే, వెబ్‌డెస్క్: Strait of Hormuz Closure | సరుకు రవాణాలో కీలక పాత్ర పోషించే హార్ముజ్ జలసంధిని ఇరాన్ (Iran) అధికారికంగా మూసివేసింది. దీంతో వందల కొద్ద నౌకలు అక్కడ చిక్కుకుపోయాయి.
ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ (Supreme Leader Khamenei) సహా పలువురు కీలక నేతలు చనిపోయారు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. అంతేగాకుండా ప్రపంచ సరుకు రవాణాలో కీలక పాత్ర పోషించే హార్ముజ్ జల సంధిని మూసి వేసింది. నౌకలు దాటడానికి ప్రయత్నిస్తే తగలబెడతామని ఐఆర్‌జీసీ వార్నింగ్ (IRGC Warning) ఇచ్చింది. దీంతో దాదాపు 700 నౌకలు అక్కడ ఆగిపోయాయి. వాటిలో వంద వరకు కంటైనర్ షిప్స్ ఉన్నట్లు సమాచారం. మార్చి 1న జలసంధి నుంచి మూడు ట్యాంకర్లు వెళ్లగా.. 2న ఒక చిన్న ట్యాంకర్, కార్గో షిప్ మాత్రమే వెళ్లాయి.
Strait of Hormuz Closure | ఎంతో కీలకం
హార్ముజ్ జలసంధి (Hormuz Strait) ఇరాన్, ఒమన్ మధ్య ఉంది. ఇది పెర్షియన్ గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్, అరేబియా సముద్రంతో కలుపుతుంది. ప్రపంచంలోని చమురు, గ్యాస్ సరఫరాలో దాదాపు 20 శాతం ప్రతిరోజూ దీని మీదుగా వెళ్తుంది. ప్రపంచంలోని అత్యంత వ్యూహాత్మకంగా ముఖ్యమైన వాణిజ్య మార్గాల్లో ఇది ఒకటి. OPEC ఉత్పత్తిదారులైన సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ, ఇరాన్ నుండి చాలా చమురు ఎగుమతులు ఈ జలసంధి మీదుగా సాగుతాయి. భారత్‌తో పాటు అనేక ఆసియా దేశాలకు హార్ముజ్ జలసంధి మీదుగానే ముడి చమురు వస్తోంది. దీనిని మూసివేయడంతో ప్రస్తుతం సరుకు రవాణా వ్యయం పెరిగి, ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.
Strait of Hormuz Closure | భారత్‌పై ప్రభావం
భారత్‌కు అధిక శాతం ముడి చమురు (Crude Oil) హార్ముజ్ జల సంధి మీదుగావే వస్తుంది. దీనిని మూసి వేయడంతో దేశానికి చమురు సరఫరా తగ్గే అవకాశం ఉంది. ఫలితంగా రేట్లు పెరుగుతాయి. బ్రెంట్ ముడి చమురులో పెరుగుదల పెట్రోల్, డీజిల్ ధరనలు పెంచుతుంది. ఖరీదైన దిగుమతులు విదేశీ మారక నిల్వలను దెబ్బతీస్తాయి.ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరగే అవకాశం ఉంది. అధిక చమురు దిగుమతి బిల్లులు రూపాయిని బలహీనపరుస్తాయి.
ఇది కూడా చదవండి..: Bahrain Protests | బహ్రెయిన్‌లో చెలరేగిన అల్లర్లు

