అక్షరటుడే, వెబ్‌డెస్క్: Strait of Hormuz Oil | ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడితో ప్రపంచ చమురు మార్కెట్లు అప్రమత్తమయ్యాయి. ప్రపంచంలో అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గం హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz)లో ఉద్రిక్తతలు పెరిగితే.. ఇంధన ముడి చమురు బ్యారెల్‌కు ధక 95 నుంచి 110 డాలర్ల వరకు ఎగబాకే అవకాశముందని ఈక్విరస్ సెక్యూరిటీస్ నివేదిక పేర్కొంది.
Strait of Hormuz Oil | ప్రపంచ సరఫరాలో మూడు శాతం..
ప్రస్తుతం ఇరాన్ దేశం నిత్యం దాదాపు 3.3 మిలియన్ బ్యారెల్ల చమురు ఉత్పత్తి చేస్తోంది. ఇది ప్రపంచ సరఫరాలో 3 శాతం. సరఫరాలో అంతరాయం ఏర్పడితే.. ఒక్కో శాతానికి ధరలు 3 నుంచి 5 శాతం వరకు పెరిగే ప్రమాదం ఉందని నివేదిక వెల్లడించింది. ఈ లెక్కన ఇరాన్ ఉత్పత్తికి మాత్రమే అంతరాయం ఏర్పడితే చమురు ధరలు 9 నుంచి 15 శాతం వరకు పెరగొచ్చు.
Strait of Hormuz Oil | అంతరాయం ఏర్పడితే..
హోర్ముజ్ జలసంధి మార్గంలో రవాణాకు అంతరాయం ఏర్పడితే, బ్యారెల్‌కు అదనంగా 20 – 40 డాలర్ల జియోపాలిటికల్ ప్రీమియం జోడించబడే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే చమురు ధరలు 95 – 110 డాలర్లకు చేరే అవకాశం ఉంది. మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక వనరులను మోహరించాక ముడి చమురు ధరలు దాదాపు 10 శాతం పెరిగాయి.
Strait of Hormuz Oil | ప్రత్యామ్నాయ వేధింపులు..
ఇరాన్ జలసంధిని మూసివేయకుండానే పలు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే అవకాశం కూడా లేకపోలేదు. సైనిక విన్యాసాల పేరుతో నావిగేషన్ ఆంక్షలు విధించడం, ట్యాంకర్లను వేధించడం, నౌకల తనిఖీల వంటి చర్యలకు దిగడం చేయొచ్చు. ఒకవేళ జలసంధిని మూసివేస్తే.. ప్రపంచ ఇంధన వాణిజ్యంపై తీవ్రంగా ప్రభావం పడే అవకాశం ఉంది.

