అక్షరటుడే, ఇందూరు: Student All-Round Development | నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించాలంటే పాఠశాల స్థాయి నుంచే పటిష్టమైన పునాది అవసరమని కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రజనీకాంత్ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని కాకతీయ ఒలంపియాడ్ పాఠశాలలో జరిగిన కాన్వొకేషన్ డే (Convocation Day) సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా అన్ని రంగాల్లో (ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్) రాణించినప్పుడే ఐఐటీ, మెడికల్, ఒలింపియాడ్, సివిల్స్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో నెగ్గుకురాగలరని అన్నారు. ఇందుకోసం ఉదయం సాధారణ పాఠశాల విద్యతోపాటు మధ్యాహ్నం నిష్ణాతులైన లెక్చరర్లతో మెడికల్, ఐఐటీ ఫౌండేషన్ తరగతులు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
Student All-Round Development | మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా
జిల్లా స్థాయి విద్యార్థులు మెట్రోపాలిటన్ నగరాల్లోని విద్యార్థులతో పోటీ పడి, దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించడమే లక్ష్యంగా విద్యా ప్రణాళిక ఉండాలని రజనీకాంత్ ఆకాంక్షించారు.
రాబోయే కాలంలో దైనందిన జీవితంలో రోబోటిక్స్ – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర 70 శాతం ఉంటుందన్నారు. అందుకే పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు రోబోటిక్స్ పరిజ్ఞానాన్ని అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇది విద్యార్థుల మానసిక శక్తిని పెంపొందిస్తుందన్నారు.
Student All-Round Development | శారీరక ధారుడ్యం
మానసిక వికాసంతో పాటు శారీరక ధారుడ్యం కోసం విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం తప్పనిసరి అని పేర్కొన్నారు. అందుకే తమ పాఠశాలల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
ఇష్టపడి చదివినప్పుడే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని తెలిపారు. ఒత్తిడితో వారిని చదివించడం సరికాదని అభిప్రాయపడ్డారు. సరైన అకడమిక్ కరికులం ఉన్న పాఠశాలలను ఎంచుకుని, తమ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయాలని తల్లిదండ్రులకు సూచించారు.
