అక్షరటుడే, మెండోరా: Student Death Investigation | మూణ్నెళ్ల క్రితం మెండోరా మండలం (Mendora Mandal)లో విద్యార్థిని మృతి జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనలో తమ కూతురి మృతి మిస్టరీ తేల్చాలని తల్లిదండ్రులు నెలలుగా న్యాయపోరాటం చేస్తున్నారు.
Student Death Investigation | సామాజిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో..
మెండోరా సామాజిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతున్న సాయి లిఖిత డిసెంబర్ 17న చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఈ ఘటనపై మూడు నెలల తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది.
Student Death Investigation | విద్యార్థిని మృతిపై అనుమానాలు..
విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన తల్లిదండ్రులు న్యాయపోరాటం కొనసాగిస్తున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టంకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో సాక్ష్యాధారాల సేకరణ కోసం మంగళవారం ఆమె స్వగ్రామమైన ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) తాంసి గ్రామంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. సాయి లిఖిత మరణం జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో పోస్టుమార్టం నివేదికపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోస్టుమార్టం సందర్భంగా శాంతిభద్రతల నిమిత్తం మెండోరా ఎస్సై సుహాసిని (SI Suhasini) ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తాంసి గ్రామానికి వెళ్లారు.
ఇది కూడా చదవండి..: Rudrur Road Accident | రుద్రూర్ శివారులో రోడ్డు ప్రమాదం.. 45 మందికి గాయాలు

